Manyam Dheerudu: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథపై తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో క్లాసిక్ గా నిలిచిపోయింది. దాదాపు 50 యేళ్ల తర్వాత అదే మన్యం వీరుడు కథతో ‘మన్యం ధీరుడు’ పేరుతో సినిమా తెరకెక్కింది. ఇందులో ఆర్ వి వి సత్యనారాయణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. మధ్యలో ఆర్ఆర్ఆర్ సహా పలు సినిమాల్లో హీరోలు అల్లూరి వేషధారణలో ప్రేక్షకుల మెప్పును పొందారు.
ఇక ‘మన్యం ధీరుడు’ సినిమాలో కథానాయకుడైన ఆర్ వివి సత్యనారాయణ స్వయంగా పాడి స్వరకల్పన చేసి హిమాలయాల్లో పిక్చరైజ్ చేసిన ఓ పాట ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈపాటను రీసెంట్ గా థాయిలాండ్, మలేషియా,బ్యాంకాక్,మయన్మార్ లాంటి దేశాలలో ప్రవాస భారతీయులు విదేశీయులతో సహా మన దేశ గాయకులకు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
త్వరలో అమెరికాలో గల తానా, జర్మనీ లో కూడా ఈ పాటను పాడబోతున్నామని విశాఖకు చెందిన శేఖర్ ముమ్మో జీ బృందం తెలియజేసారు.ఈ పాటకు తుంబలి శివాజీ సాహిత్యాన్నందించడం విశేషం. భారత దేశ ఔన్యత్యాన్ని చాటి చెప్పే ఈ అద్భుతమైన పాట ఇంకా ఎంతో ప్రాచుర్యం పొందుతోంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter