Tenent Movie Review: ఆకట్టుకునే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్... టెనెంట్ మూవీ..

Tenent Movie Review: సత్యం రాజేష్ గత కొన్నేళ్లుగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తూనే హీరోగా కూడా చేస్తున్నాడు. గతేడాది 'పొలిమేర 2'  మూవీతో అలరించిన ఈయన.. తాజాగా ఇపుడు 'టెనెంట్'మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో సత్యం రాజేష్ మరో హిట్ అందుకున్నాడా ? లేదా అనేది చూడాలి.  

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 19, 2024, 11:57 AM IST
Tenent Movie Review: ఆకట్టుకునే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్... టెనెంట్ మూవీ..

రివ్యూ:  టెనెంట్ (Tenent)
నటీనటులు: సత్యం రాజేష్, మేఘా చౌదరి, ఎస్తేర్ నోరోన్హ, ధన బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న, చందనపు పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్  తదితరులు
సినిమాటోగ్రఫీ: జెమిన్ జోమ్ అయ్యనేత్
ఎడిటర్: విజయ్ ముక్తవరుపు
సంగీతం: సాహిత్య సాగర్
నిర్మాత: మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి  
స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ దర్శకత్వం: వై.యుగంధర్  
విడుదల తేది: 19-4-2024

మర్డర్ మిస్టరీ సినిమాలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. సరైన స్టోరీ, స్క్రీన్ ప్లేతో సినిమాని తీయగలిగితే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం చాలా సులభం.అందుకే దర్శకులు, నిర్మాతలు కూడా ఇలాంటి వాటికి ఎక్కవ ప్రాధాన్యం ఇస్తున్నారు. మన చుట్టు పక్కల జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలకు ప్రేరణ చెంది.. ఈ తరహా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులను చాలా నాచురల్ గా,  రియల్ స్టిక్ గా తెరమీద చూపించడం వల్ల ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. తాజాగా సత్యం రాజేష్, మేఘా చౌదరి జంటగా ‘టెనెంట్’ పేరుతో ఓ మర్డర్ మిస్టరీ సినిమాని దర్శకుడు వై.యుగంధర్ తెరకెక్కించారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మోగుళ్ల చంద్రశేఖర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..
 గౌతమ్(సత్యం రాజేష్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. తనకు ఓ అందమైన భార్య సంధ్య(మేఘా చౌదరి) ఉంటుంది. ఇద్దరూ ఎంతో అన్యోన్యమైన దంపతులుగా ఆ అపార్ట్ మెంట్‌లో ఉంటారు. సంధ్య, గౌతమ్... ఇద్దరూ చాలా డీసెంట్. ఇంత అన్యోన్యమైన దాంపత్య జీవితం సాగుతున్న వీరి జీవితంలోకి పక్క ఫ్లాట్ లో ఉంటున్న ఇద్దరు అమ్మాయిలు రమ్య పొందూరి, మేగ్న పరిచయమవుతారు. సంధ్యతో క్లోజ్ అయ్యి... ఆమెతో పరిచయం పెంచుకుంటారు. ఈ పరిచయం వీరి మధ్య స్నేహానికి దారితీస్తుంది. అయితే ఓ రోజు ఉన్నట్టుండి సంధ్య శవాన్ని ఓ సూట్ కేసులో గౌతమ్ వేసుకుని పోయి... నగరానికి దూరంగా ఎవరు లేని ప్రదేశంలో శవాన్ని తగులబెడతాడు. అయితే తన భార్య కనిపించడంలేదని పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. దాంతో ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ లేడీ ఆఫీసర్(ఏస్తర్)ని నియమిస్తారు. మరి ఈ మర్డర్ మిస్టరీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎలా చేధించింది? సంధ్య చావుకు కారకులు ఎవరు? ఆమె శవాన్ని తన భర్త ఎందుకు రహస్యంగా కాల్చాల్సి వచ్చింది? వీరి జీవితంలోకి ఎంటర్ అయిన మరొక జంట ఏమైందనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ, టెక్నికల్ విషయానికొస్తే..

ఇలాంటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాకు ప్రధానంగా కావాల్సింది సరైన స్క్రీన్ ప్లే. ఈ సినిమాలో అదే మెయిన్ హైలెట్. ఎక్కడా ప్రేక్షకులు కన్ఫూజన్ లేకుండా చివరి వరకు సస్పెన్స్ మెయింటెన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొదటి సగ భాగం సరదగా సాగిపోయే సినిమా.. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చే వరకు మర్డర్ మిస్టరీతో పెద్ద ట్విస్ట్  ఇచ్చి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు.  ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది. సంధ్య మరణానికి ఎవరు కారణము ? ఎలాంటి పరిస్థితులు ఆమె మర్డర్‌కు దారి తీసాయి.  అమెరికాకు వెళ్లాల్సిన గౌతమ్... కెరీర్ అన్యాయంగా ఎలా ముగిసింది.. తమ ప్రమేయం లేకుండానే ఎంతో అన్యోన్యంగా ఉండే జంట... అర్ధాంతరంగా ఎందుకు తువు  చాలించాల్సి వచ్చిందనేది ప్రేక్షకుల గుండె పిండేలా క్లైమాక్స్ ను ముగించారు. నేటితరం అమ్మాయిలకు ఓ మంచి మెసేజ్ ఇస్తుంది ఈ సినిమా. పరిచయం లేని వ్యక్తులతో ఎలా జాగ్రత్తగా ఉండాలనేది ఇందులో చక్కగా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు. . అమ్మాయిలకు ‘టెనెంట్’ ఓ అద్భుతమైన మెసేజ్ ఇస్తుంది.

దర్శకుడు యుగంధర్..కొత్త వాడైనా.. థ్రిల్లింగ్ ఎలిమెంట్‌కు మంచి మెసేజ్‌తో ఈ సినిమాను ఎక్కడా ప్రేఓకులు బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేసాడు.  ముఖ్యంగా నగరాల్లో  జీవించే అమ్మాయిలకు ఇలాంటి సినిమాలు ఎంతో కనువిప్పు కలిగిస్తాయి.  అంతేకాదు చాలా మంది ఇందులోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు.  అలాగే అపార్ట్ మెంట్ కల్చర్ లో కూడా ఎలాంటి జాగ్రత్తలతో వ్యవహిరించాలనే దాన్ని చాలా చక్కగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. నేపథ్య సంగీతం బాగుంది. ఓ డీసెంట్ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ అయితే బాగుంటుందో  దాన్ని చక్కగా క్యారీ చేశారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ బాగున్నాయి. సత్యం రాజేష్, మేఘా చౌదరి జంటను అందంగా చూపించారు. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. సినిమా నిడివి కూడా రెండుగంటల లోపే ఉండటం సినిమాకి పెద్ద ప్లస్. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇలాంటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ ను ఇష్టపడేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చతుంది.

నటీనటుల పనితీరు ఎలా ఉందంటే...

సత్యం రాజేష్... చాలా డీసెంట్ పాత్రలో మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు.  గతంలో చేసిన సినిమాలకు ఏమాత్రం పోలిక లేకుండా ఉండే ఓ ఎమోషనల్ పాత్రలో జీవించాడు. అతనికి జంటగా నటించిన మేఘా చౌదరి కూడా చాలా సాంప్రదాయ బద్ధంగా కనిపిస్తోంది.  ఓ డీసెంట్ ఫ్యామిలీలో అమ్మాయి ఎలా ఉంటుందో అలాంటి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది.  ఇందులో మరో యువ జంట కూడా ఉంది. చందన పయావుల... ఇంతకు వెబ్ సిరీస్ తో అందరికీ సుపరిచితురాలే. చాలా క్యూట్ గా నటించింది.  ఆమెకు పెయిర్ గా నటించిన భరత్ కూడా తన పాత్ర పరిధి మీరకు నటించి మెప్పించాడు.  నెగిటివ్ రోల్ పోషించిన దిలీప్... కాసేపు చేసినా నెగిటివ్ రోల్ కు ప్రాణం పోశాడనే చెప్పొచ్చు. అతనితో పాటు నటించిన చందు, అనురాగ్, రమ్య, మేఘ్నా అంతా... తమ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్

ఇంటర్వెల్ బ్యాంగ్

సినిమా నిడివి

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

అక్కడక్కడా లాజిక్ లేని సీన్స్

ఫస్ట్ హాఫ్

లాస్ట్ పంచ్.. థ్రిల్ చేసే టెనెంట్ మూవీ

రేటింగ్: 3/5

Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News