రివ్యూ: ‘ది బర్త్ డే బాయ్’ (The Birthday Boy)
నటీనటులు: రవికృష్ణ తోట, రాజీవ్ కనకాల, ప్రభోదిని, సమీర్ మల్ల, మని వాక, విక్రాంత్ వేద్ తదితరులు..
సినిమాటోగ్రఫీ: రాహుల్ మేచినేని
సంగీతం: ప్రశాంత్ శ్రీనివాస్
నిర్మాత: భరత్ ఇమ్మలరాజు
దర్శకత్వం: విస్కీ దాసరి
అంతా కొత్త వాళ్లతో కొత్త దర్శకుడు విస్కీ దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ది బర్త్ డే బాయ్’. సస్పెన్స్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
‘ది బర్త్ డే బాయ్’ కథ విషయానికొస్తే.. అమెరికాలో ఒక ఊరికి చెందిన ఐదుగురు స్నేహితులు కలిసి మెలిసి ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ఐదుగురు ఫ్రెండ్స్ లో ఒకరి బర్త్ డే వస్తోంది. పుట్టినరోజు సందర్బంగా తమ స్నేహితుడిని కాస్త ఆట పట్టిద్దామని మిగతా నలుగురు అనుకుంటారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాల్లో పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తి అనుకోకుండా చనిపోతాడు. సడెన్ ఓ వ్యక్తి చనిపోవడంతో అతని ఫ్రెండ్స్ షాక్ కు గురవుతారు. ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తి వెనక ఏమైనా కుట్ర ఉందా.. ? అనుకోకుండానే చనిపోయాడా.. ? ఈ క్రమంలో ఏం జరిగిందనేదే ‘ది బర్త్ డే బాయ్’ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ఇదో సింపుల్ స్టోరీ. కానీ దాన్ని దర్శకుడు మలిచిన విధానం ఓ మోస్తరుగా ప్రేక్షకులను కుర్చీలోంచి కదలనీయకుండా చేసిందనే చెప్పాలి. ఒక ఊరికి చెందిన ఐదురుగు కుర్రాళ్లు అమెరికాలో ఓ ఇంట్లో కలిసి జీవిస్తూ ఉంటారు. సరద సరదాగా సాగిపోయే వారి జీవితంలో అనుకోకుండా ఓ స్నేహితుడి పుట్టినరోజు వస్తుంది. అతన్ని బర్త్ డే బాయ్ ను ఆట పట్టించడానికి స్నేహితులు చేసిన ఓ పని అతని ప్రాణం పోయేలా చేస్తుంది. ఈ క్రమంలో తమ భవిష్యత్తు ఏమవుతుందో అనే బెంగ ఆ నలుగురు స్నేహితుల్లో కలగడం వంటివి చాలా నాచురల్ గా తెరకెక్కించారు. దేశం కానీ దేశంలో అనుకోని పరిస్థితుల్లో స్నేహితుడు చనిపోవడం. ఈ క్రమంలో వాళ్లు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసారనేది ఫస్టాఫ్ వరకు బాగానే లాక్కొచ్చిన దర్శకుడు. సెకండాఫ్ లో రొటిన్ కథనంతో కాస్త తడబడ్డట్టు కనబడ్డాడు. అయినా.. ఓవరాల్ గా ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.అంతా కొత్త వాళ్లతో ఒక ఇంట్లో ఈ సినిమా మొత్తాన్ని 70 శాతం వరకు నడిపించడం మరో ఎత్తు అని చెప్పాలి. ఒకప్పుడు రాంగోపాల్ వర్మ చేసిన ప్రయోగాన్ని తాజాగా దర్శకుడు విస్కీ దాసరి సరికొత్తగా చూపించే ప్రయత్నం చేయడం మంచి పరిణామం. ఫస్టాఫ్ వరకు ఎంతో పకడ్బందీగా స్క్రీన్ ప్లే లాక్కొచ్చినా.. సెకండాఫ్ లో సాదాసీదాగా ఫ్లాష్ బ్యాక్ తో నడిపించాడు. ఈ సినిమాకు సినిమాటగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ ఈ సినిమాకు ప్లస్. ఎడిటర్ ఈ సినిమాకు తన వంతు సహకారం అందించాడు. ఎక్కడ అనవసరమైన సీన్స్ లేకుండా జాగ్రత్త పడ్డాడు.
Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?
నటీనటుల విషయానికొస్తే..
రవికృష్ణ ఈ సినిమా లీడ్ యాక్టర్ గా మంచి నటన కనబరిచాడు. మని వాక, విక్రాంత్ వదేతో తమ నటనతో ఆకట్టుకున్నారు. మరోవైపు సీనియర్ నటుడు రాజీవ్ కనకాల నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మిగతా వారు కొత్తవారైన తమ యాక్టింగ్ మెప్పించారు.
ప్లస్ పాయింట్స్
ఫస్టాఫ్
రీ రికార్డింగ్
మైనస్ పాయింట్స్
సెకండాఫ్
లాజిక్ లేని సీన్స్
పంచ్ లైన్ : ఓ మోస్తరుగా ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్ ‘ది బర్త్ డే బాయ్’
రేటింగ్ : 2.75/5
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook