8th Pay Commission Latest Updates: 7వ వేతన సంఘం కేంద్రంలో ఎన్టీయే ప్రభుత్వం 2014లో ప్రకటించి 2016లో అమల్లో తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. గత బడ్జెట్ లో కేంద్రం 8వ వేతన సంఘం అనౌన్స్ చేస్తుందని అందరు ఆశగా ఎదురు చూసారు. కానీ రాబోయే బట్జెట్ సమావేశాల్లో 8వ పే కమిషన్ ప్రకటించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ న్యూస్ ను లీక్ చేసారు.
8th Pay Commission Latest Updates:ఈ బడ్జెట్ సమావేశాల్లోనే 8వ పే కమిషన్ పై సెంట్రల్ గవర్నమెంట్ అతిపెద్ద నిర్ణయం తీసుకోబోవడం గ్యారంటీ అని చెబుతున్నారు. దీనిపై ఆర్ధిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు పదకొండేళ్ల క్రితం కేంద్రం 7వ వేతన సంఘం ప్రకటించింది. అయితే గత బడ్జెట్‌లో కేంద్ర సర్కారు 8వ వేతన సంఘం ప్రకటిస్తుందని ఎంప్లాయిస్ ఆశగా ఎదురు చూశారు.
ఈ సందర్బంగా ఆర్ధిక శాఖ కార్యదర్శి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2014లో 7వ వేతన సంఘం ఏర్పాటు చసారు. ఇది కూడా అంత ఈజీగా జరగలేదు. ఇక 8వ వేతన సంఘం అమలు చేయడానికి ఇంకా సమయం ఉందని చెబుతున్నారు.
2025-26 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. 8వ పే కమిషన్ కు ఏర్పాటుకు 2026 జనవరి 1 వరకు గడువు ఉంది. అంటే సరిగ్గా యేడాదిలోనే దీనిపై ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పనుంది.
సాధారణంగా గవర్నమెంట్ ఎంప్లాయిస్ జీతాలకు సంబంధించి 10 ఏళ్లకు ఒకసారి పే కమిషన్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తూ రావడం ఆనవాయితీ వస్తుంది. చివరగా 7వ వేతన సంఘాన్ని ఫిబ్రవరి 2014లో ఏర్పాటు చేయశారన్నారు. దాని సిఫార్సులు 1 జనవరి 2016 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్ కౌన్సిల్ (స్టాఫ్ సైడ్), జాయింట్ కన్సల్టేటివ్ మెషినరి (NC -JCM), సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్.. కార్మికుల సంఘం కలిసి వచ్చే బడ్జెట్ లో దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు.
2014లో 7వ వేతన సంఘాన్ని 28 ఫిబ్రవరి 2014లో సమర్పించిన మధ్యంతర బడ్జెట్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే యేడాది మార్చి 2014 ఎన్నికలకు వెళ్లింది. ఇంతలోనే.. 2025లో 8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది.
8వ వేతన సంఘం ప్రకటనపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. గత సెప్టెంబర్ లోగా మేము 8వ వేతన సంఘంపై కేంద్రం కీలక ప్రకటన చేస్తుందని అందరు ఆశించారు. కానీ అది జరగలేదు. కానీ ఈ సారి బడ్జెట్ లో దీనిపై ప్రభుత్వం ఓ ప్రకటన చేయనుంది.
8వ వేతన సంఘంలో గవర్నమెంట్ ఉద్యోగుల బేసిక్ జీతాలకు సంబంధించి 3.68 శాతం ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను సిఫారసు చేయాలని ప్యానెల్‌ను కోరతామన్నారు. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే.. కనీస వేతం రూ.26 వేలకు పెరుగనుంది.