Pushpa 2: విడుదలై 40 రోజులైనా ఇంకా ఆశ చావలేదా పుష్ప .. ఇంకా ప్రేక్షకులను పిండు కుందామనే..

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ మూవీ భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలన విజయం సాధించింది. అంతేకాదు భారతీయ బాక్సాఫీస్ దగ్గర పలు రికార్డులు తన పేరిట రాసుకుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగింపు వచ్చినా.. ఈ సినిమా మేకర్స్ ఆశ చావక.. టికెట్ రేట్స్ తగ్గించారు.

1 /6

Pushpa 2: ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ పుష్ప 2 విషయంలో రెండు జరిగాయి. ఇంట గెలిచిన పుష్ప 2... బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ అందుకొని ఔరా అనిపించాడు.

2 /6

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన  బాహుబలి 2 తర్వాత ఓ ప్రాంతీయ తెలుగు చిత్రం.. హిందీ చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హిట్ గా నిలిచి అక్కడ హీరోలకు చుక్కలు చూపించింది.

3 /6

అంతేకాదు పుష్ప 2 మూవీ బాహుబలి 2 సాధించిన లైఫ్ టైమ్ కలెక్షన్స్ రూ. 1812 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేసిన రూ. 1850 కోట్ల గ్రాస్ వైపు పరుగులు తీస్తోంది.

4 /6

సంక్రాంతి సీజన్ రాకతో పుష్ప 2 హవా తగ్గింది. ఇక ఈ సంక్రాంతి విడుదలైన చిత్రాల్లో ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి. గేమ్ చేంజర్ డిజాస్టర్ గా నిలిచింది.

5 /6

ఈ నేపథ్యంలో పుష్ప 2 మేకర్స్ నైజాంలో ఈ సినిమా టికెట్ రేట్స్ ను తగ్గించారు. సింగిల్ స్క్రీన్ లో రూ. 112, మల్టీప్లెక్స్ లో రూ. 150 అంటూ బంపరాఫర్ ప్రకటించింది. దీంతో కొంత మంది నెటిజన్స్ ఇప్పటికే తెలుగు సహా భారతీయ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టినా పుష్ప 2 మేకర్స్ కు ఇంకా ఆశ చావక .. ఈ తగ్గింపు రేట్స్ ఏంటో అని విస్తుపోతున్నారు.

6 /6

పుష్ప 2 మూవీ ఈ నెల 24న నెట్ ఫ్లిక్స్ లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర రన్ దాదాపు ఎండ్ కు వచ్చిన పుష్ప 2 ఓటీటీ వేదికగా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.