Today Gold Rates: ట్రంప్ దెబ్బ.. రూ. 88వేలు దాటిన బంగారం ధర.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే

 Today Gold Rates: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు సరికొత్త రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర రూ. 88వేలు దాటింది. ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర ఆల్ టైమ్ హైస్థాయికి చేరుకుంది. పది గ్రాములకు ఎంత పలుకుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 

1 /6

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో బంగారానికి విడదీయలేని అనుబంధం ఉంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగల్లో కచ్చితంగా ఉండాలని భారతీయులు భావిస్తుంటారు. అందుకే ఏడాది పొడవునా మనదేశంలో బంగారం కొనగోలు చేస్తుంటారు. అయితే కొద్ది నెలలుగా చూసుకుంటే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.

2 /6

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి బంగారం ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పవచ్చు. ఇక అధికారం చేపట్టి తర్వాత టారిఫ్స్ పెంపు ప్రకటనలు వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయన్న అంచనాలతో మదుపరులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడగా భావిస్తున్నారు. ఇతర మార్గాల్లోని పెట్టుబడులను బంగారంలోకి మళ్లిస్తున్నారు. 

3 /6

 రోజు రోజుకు బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. వరుసగా నాలుగో రోజు బంగారం ధఱలు పెరగడంతో సరికొత్త రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 88వేల మార్క్ దాటేసింది. ఫిబ్రవరి 21వ తేదీన ధరలు తెలుసుకుందాం.   

4 /6

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం సరికొత్త రికార్డ్ స్థాయికి చేరింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు నేడు 2950డాలర్లకు దాటి ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ వెండి ధర ఔన్సుకు 33 డాలర్లు దాటేసింది. ఆల్ టైమ్ హై స్థాయిగా చెప్పవచ్చు. అయితే భారత కరెన్సీ రూపాయి మారకం విలువ కాస్త పుంజుకుంది. ప్రస్తుతం రూ. 86,583 దగ్గర అమ్ముడవుతోంది.   

5 /6

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు పెరిగి సరికొత్త గరిష్టాలను చేరుకున్నాయి. నాలుగు రోజుల్లో 24క్యారెట్ల మేలిమి బంగారం ధర తులం రూ. 2000మేర పెరిగింది. నేడు ఒక్కరోజే 10 గ్రాములపై రూ.390 పెరగడంతో రూ. 88వేల 40 దగ్గరకు ఎగబాకింది. ఇక 22క్యారెట్ల నగల తయారీ బంగారం ధర నేడు రూ. 350 పెరగడంతో పది గ్రాముల ధర రూ. 80వేల 700కు చేరుకుంది.   

6 /6

ఓ వైపు బంగారం ధరలు పరుగులు పెడుతున్నా వెండి కాస్త ఊరట కల్పిస్తోంది. వారం రోజుల నుంచి స్థిరంగా ఒకే ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1.08లక్షల దగ్గర కొనసాగుతోంది. బంగారం కొనుగోలు చేయలేని వారు వెండిని ఎక్కువగా కొంటున్నారు.