Schools and Colleges Holiday in Telangana: కొన్నిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏబీవీపీ నాయకులు దీనిపై విద్యాశాఖ చర్యలు తీసుకొవాలని కూడా పలుమార్లు కలిసి వినతిపత్రాలు అందజేశారు.
కొన్ని రోజుల క్రితమే సమ్మర్ హలీడేస్ ముగిసాక.. స్కూళ్లు, కాలేజీలు మరల ఓపెన్ అయ్యారు. ఈ నేపథ్యంలో చాలా చోట్ల ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు వ్యాపారానికి తెరతీశాయి. విద్యను ఒక బిజినెస్ లాగా మార్చేశాయి. ఇప్పటికే సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్నారు.
ప్రతి ఏడాది సమ్మర్ ముగియగానే స్కూళ్లు మొదలైపోతాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని టార్గెట్ గా ప్రైవేటు బడుల్లో చేర్పిస్తుంటారు. ఇక్కడ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు అందినకాడికి తల్లిదండ్రులను దోచుకుంటున్నారు.
అనేక రకాలుగా యూనీఫామ్, బుక్స్ లు, స్పోర్ట్స్, ఎక్స్ ట్రా యాక్టివిటీస్ అంటూ ఇష్టమున్నట్లు ఫీజులను గుంజుతున్నారు. దీని వల్ల సాధారణ, మధ్యతరగతి ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏబీవీపీ పలు చోట్ల దీనిపై నిరసలను చేపట్టింది. విద్యాశాఖకు కూడా దీనిపై చర్యలు తీసుకొవాలంటూ వినతి పత్రాలు సైతం ఇచ్చారు.
తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీల్లో జూన్ 26 న బంద్ ను పాటించాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది. ప్రైవేటు..విద్యాసంస్థల అధిక ఫీజుల వసూళ్ల మీద నిరసనగా ఈ బంద్ కు పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్కూళ్ల నుంచి తమ స్టూడెంట్స్ ల ఫోన్ లకు సిబ్బంది హలీడే ఇస్తున్నట్లు మెసెజ్ లు చేస్తున్ననట్లు సమాచారం.
బుధవారం రోజున ఏబీవీపీ బంద్ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, బంద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్యారెంట్స్ తమ పిల్లలతో ఇతర ప్లాన్ లు వేసుకొవడంతో బీజీగా ఉన్నట్లు సమాచారం.