Naresh Pavitra Lokesh: టైటానిక్ ఒడ్డుకు చేరింది.. పవిత్రతో రిలేషన్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేసిన నరేష్‌..

Naresh Pavitra Lokesh Relationship: విజయ్ కృష్ణ నరేష్ ఈ సీనియర్‌ నటుడు ప్రస్తుతం తండ్రి ఇతర ప్రత్యేక క్యారెక్టర్లు వేస్తూ అలరిస్తున్నారు. 1970 లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా 'పండంటి కాపురం' సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. అలా హీరో, నటుడిగా ఇప్పటి వరకు దాదాపు 200 చిత్రాలుకు పైగా నటించారు.  అయితే తాజాగా ఆయన తన భార్య అయిన నటి పవిత్ర లోకేష్ పై ఆసక్తికరమైన కామెంట్ చేశారు నరేష్. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 

1 /5

'రెండు జెళ్ల సీత', ' శ్రీవారికి ప్రేమలేఖ', ' మనసు మమత' వంటి ప్రముఖ చిత్రాల్లో నటించి హీరోగా తనదైన ముద్ర వేసుకున్నారు నటుడు నరేష్. ప్రముఖ సీనియర్ నటి నిర్మాత అయిన విజయనిర్మల గారి కొడుకు. తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో కూడా సీఎంగా నటించి తెలంగాణ యాసలో అదరగొట్టారు.   

2 /5

నరేష్‌ పర్సనల్‌ లైఫ్‌ విషయానికి వస్తే మొదట రేఖ ప్రియా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత డైవర్స్ తీసుకున్నారు. రమ్య రఘుపతిని రెండో పెళ్లి  చేసుకుని డైవర్స్ తీసుకుని 2023లో పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకున్నారు. పవిత్ర లోకేష్ కూడా తెలుగు, తమిళ సినిమాల్లో మంచి నటి. అయితే ఇటీవల పవిత్రతో తన రిలేషన్‌పై ఆసక్తికర కామెంట్ చేశారు నరేష్.  

3 /5

నటి పవిత్ర వచ్చాక తన జీవితం మెరుగుపడిందని నరేష్ చెప్పుకొచ్చారు. లైఫ్ టైటానిక్ షిప్ ఒడ్డుకు చేరిందట్లయిందని తనదైన శైలిలో చమత్కరించారు. అర్థం చేసుకునే మనుషులు మన జీవితంలో ఉంటే చాలా అంతా బాగుంటుందని ఆయన పేర్కొన్నారు.  

4 /5

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా తనకు మంచి అనుబంధం ఉందని నరేష్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులోనూ ఇదే బంధం కొనసాగిస్తానని అన్నారు. తాజాగా యాక్టర్ నరేష్ పవిత్ర లోకేష్ తో ఉన్న సంబంధాలు రిలేషన్ పై ఈ ఆసక్తికర కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

5 /5

ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లి విజయనిర్మలకు  పద్మా అవార్డు రావాలని ఎంతో కృషి చేశానని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎంతో ప్రయత్నించారని గుర్తు చేసుకున్నారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ కూడా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు నరేష్‌.