Jayasudha: 70 ఏళ్ల స్టార్ హీరో తో జయసుధ ప్రేమాయణం.. ఏం చెప్పిందంటే..!

Jayasudha Love: 70 ఏళ్ల స్టార్ హీరో.. తో జయసుధ ఏడడుగులు వేయబోతోంది అంటూ వచ్చిన వార్తల గురించి క్లారిటీ ఇచ్చింది ఈ నటి. ఈమెకు తెలుగులో ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఎంతోమంది సీనియర్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ప్రస్తుతం సపోర్టింగ్ రూల్స్ చేస్తున్న జయసుధ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది..

1 /5

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సహజ నటి జయసుధ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు ఎన్టీఆర్ ను మొదలుకొని చాలామంది హీరోల సరసన జత కట్టింది జయసుధ. ముఖ్యంగా తెలుగు సినిమాలే కాకుండా తమిళ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. 

2 /5

ఇదిలా ఉండగా గతంలో బాలచందర్ దర్శకత్వంలో సహజ నటి జయసుధ ఎక్కువగా నటించింది. ముఖ్యంగా ఈమె నటించిన సినిమాలలో విశ్వనటుడు కమలహాసన్ కూడా ఎక్కువగా నటించేవారు. అంతేకాదు వీరిద్దరూ కలిసి చాలా సినిమాలలో నటించడంతో లేనిపోని రూమర్స్ అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. దీనికి తోడు వీరిద్దరూ కలిసి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఒకే స్టేజిపై కలిసి పాటలు పాడడం చూసి ఇక నిజంగానే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపించాయి.

3 /5

అయితే ఇదే విషయంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయసుధ క్లారిటీ ఇచ్చింది.ఇంటర్వ్యూలో భాగంగా అప్పట్లో మీరు కమలహాసన్ ను ప్రేమించి,  పెళ్లి చేసుకోవాలనుకున్నారట కదా.. నిజమేనా?  అని ప్రశ్నించగా అబ్బా ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న అడుగుతున్నారు అంటూ కాస్త చిరాకు పడిన జయసుధ ఆ తర్వాత క్లారిటీ ఇచ్చింది

4 /5

మేమిద్దరం ప్రేమించుకోలేదు. కానీ ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలలో నటించాము.ముఖ్యంగా బాలచందర్ సినిమాలు అంటే జయసుధ , కమలహాసన్ జంట ఉండేది. అలాగే ఇద్దరం కూడా స్టేజ్పై పాడేవాళ్ళం. ముఖ్యంగా ఆయన ఒక బెస్ట్ సింగర్ కూడా. జర్నలిస్టులు నాకెలాగైతే సహజ నటి అని బిరుదు ఇచ్చారో.. అలాగే మా ఇద్దరి జంటకి కూడా అంతే మంచి గుర్తింపు అందేలా చేశారు. ముఖ్యంగా మేమిద్దరం ఒక సినిమాలో నటిస్తే చూడముచ్చటగా ఉందని చాలా చక్కటి జంట అని మమ్మల్ని పొగిడేవారు.అంతేతప్ప మా మధ్య ఏమీ లేదు అంటూ జయసుధ క్లారిటీ ఇచ్చింది.

5 /5

ఇక కమల్ హాసన్ విషయానికి వస్తే.. వాణి గణపతిని వివాహం చేసుకున్న ఈయన ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి ప్రముఖ ఆర్టిస్ట్ సారికను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు జన్మించిన తర్వాత ఆ సారికకి కూడా విడాకులు ఇచ్చిన ప్రముఖ నటి గౌతమితో డేటింగ్ చేశారని వార్తలు వినిపించాయి.