Mandana Karimi: దుస్తులు మార్చుకుంటుండగా లోపలికి వచ్చాడు

బాలీవుడ్ నటి మందన కరిమి బాలీవుడ్ నిర్మాత మహేంద్ర ధరివాల్‌పై మీ టూ ఆరోపణలు చేశారు.  క్యా కూల్ హై హమ్ 3 లాంటి అడల్ట్ కామెడీస్ చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లలో తన అందాలు ఆరబోసి బాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మందన కరిమి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాజాగా మీ టూ ఆరోపణలతో మందన కరిమి మరోసారి వార్తల్లోకెక్కింది.

  • Nov 24, 2020, 19:33 PM IST

మందన ప్రస్తుతం కోకో కోలా సినిమాలో సెక్సీ క్వీన్ సన్నీ లియోన్‌తో కలిసి నటిస్తోంది. హారర్ కామెడి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సన్నిలియోన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తుండగా మందన కరిమి మరో కీలక పాత్రలో కనిపించనుంది.

1 /5

కోకో కోలా చిత్రం షూటింగ్ దశలో ఉన్నప్పుడే నిర్మాత మహేంద్ర ధరివాల్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని మందన కరిమి ఆరోపించింది.

2 /5

మహేంద్ర ధరివాల్ తనను మానసికంగా వేధింపులకు గురిచేశాడని.. షూటింగ్‌లో తన వంతు సన్నివేశాలు అయిపోయిన తర్వాత కూడా మరో గంటసేపు ఎక్స్‌ట్రా ఉండాలని వేధించేవాడని సంచలన ఆరోపణలు చేసింది.

3 /5

తనకు వేరే పనులు ఉన్నాయని చెప్పినా వినిపించుకోకుండా తాను దుస్తులు మార్చుకునేటప్పుడు మహేంద్ర ధరివాల్ ( Mahendra Dhariwal ) ఏకంగా క్యారావాన్‌లోకి వచ్చి తనపై దురుసుగా ప్రవర్తించాడని వాపోయింది. అంతేకాకుండా తనపై నోటికి వచ్చినట్టు బూతులు తిట్టాడని మందన కరిమి ఆవేదన వ్యక్తంచేసింది.

4 /5

ఇటీవల పాయల్ ఘోష్ ( Actress Payal Ghosh ) ఇదే తరహాలో అనురాగ్ కశ్యప్‌పై చేసిన ఆరోపణలు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. పాయల్ ఘోష్ ఇచ్చిన ఫిర్యాదుతో ముంబై పోలీసులు అనురాగ్ కశ్యప్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

5 /5

ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్‌లో వార్తల్లోకెక్కిన మీ టూ ఆరోపణలు ఇవే. ఈసారి మందన కరిమి ( Mandana Karimi ) ఏం చేయనుందో వేచిచూడాల్సిందే మరి.