School Holiday: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో రేపు అన్నీ స్కూళ్లు, కాలేజీలకు సెలవు..

School Holiday in Telangana: విద్యార్థులకు సెలవు అంటేనే ఎగిరి గంతేసే వార్త. ఈనేపథ్యంలో తెలంగాణలో ఈ జిల్లాల్లో అన్నీ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. దీంతో విద్యార్థులు సంబరపడిపోతున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 26, 27 వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఇది కాకుండా రేపు సోమవారం కూడా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
 

1 /6

విద్యార్థులకు రేపు సోమవారం సెలవు ఫిబ్రవరి 24న ప్రకటించింది ప్రభుత్వం. దీంతో వారికి భారీ ఊరట ఇచ్చింది. ఇప్పటికే ఈ నెలలో 26, 27 వరుసగా రెండు రోజులు సెలవు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా రేపు కూడా ఈ జిల్లాల్లోని అన్నీ స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవు ప్రకటించింది.  

2 /6

బంజారాల ఆరోగ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహరాజ్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని రేపు సోమవారం అన్ని స్కూల్లకు సెలవు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఈ మేరకు ఆదివారం రామ్ లీలా మైదానంలో జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.  

3 /6

ఈ సెలవుకు బదులుగా ఏప్రిల్ 12వ తేదీ రెండో శనివారని పనిచేయాల్సిందిగా ప్రకటించారు. అయితే ఈ సెలవు తెలంగాణ మొత్తం వర్తించదు.. కేవలం ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ విద్యాసంస్థలకు మాత్రమే సెలవు ప్రకటించారు.  

4 /6

బంజారాల ఆరాధ్య దైవం అయిన సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవాలు సందర్భంగా ఈ సెలవు ప్రకటించింది. ఫోటో ఫిబ్రవరి 26, 27 తేదీల్లో కూడా వరుసగా రెండు రోజులు సెలవు ప్రకటించారు. శివరాత్రి, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సెలవు ప్రకటించారు.  

5 /6

26వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటించారు. ఇక 27వ తేదీ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో సెలవు ప్రకటించారు.  

6 /6

ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సెలవు ప్రకటించారు. అది కాకుండా విద్యార్థులు కూడా ఇది కాస్త ఊరటను అందిస్తుంది. మరోవైపు ఉద్యోగులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు.