Shriya Health : ఒకప్పుడు శ్రియా అంటే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్.. బహుశా శ్రియనే అని అయి ఉంటుంది ఏమో అన్న గాని అతిశయోక్తి లేదు.
శ్రియ పేరు వింటే చాలు.. అందం, అభినయం, డాన్స్.. గ్లామర్ పాత్రలు ఇలా ఎన్నో గుర్తొస్తాయి. చిరంజీవి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు.. అన్ని జనరేషన్స్ స్టార్ హీరోస్ తో నటించింది ఈ హీరోయిన్.
ఇష్టం సినిమాతో పరిచయమైన ఏ ముద్దుగుమ్మ.. ఆ తరువాత సంతోషం, నువ్వే నువ్వే, చెన్నకేశవరెడ్డి సినిమాలతో హ్యాట్రిక్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
ఆ తర్వాత వరస అవకాశాలతో దూసుకుపోయిన ఈ హీరోయిన్ ఏకంగా రజనీకాంత్ తో లభించే అవకాశం దక్కించుకొని.. శివాజీ సినిమాలో కనిపించి మెప్పించింది. అయితే శివాజీ సినిమా తరువాత కొద్దిగా తెలుగు సినిమాలకు దూరమై ఎక్కువగా తమిళ సినిమాల మీద దృష్టి పెట్టింది శ్రీయ.
అంతేకాకుండా హిందీలో కూడా ఎన్నో అవకాశాలు దక్కించుకుంది. రెండుమూడు ..హాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది. ఇప్పటికీ నాలుగు పదుల వయసులో కూడా రెండు పదుల అమ్మాయిల కనిపిస్తూ ఉంటుంది. అలాంటి శ్రియ ఈ మధ్య సిలైన్ ఎక్కించుకుంటూ ఒక వీడియో పంచుకుంది. అసలు శ్రియకి ఏమయింది.. ఈమె హాస్పిటల్లో ఉందా..? అనే సందేహాలు వచ్చాయి.
అయితే అక్కడ శ్రియ చాలా బాగా రెడీ అయ్యి ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు. అలా సిలైన్ ఎక్కించుకుంటున్నా..కానీ ఎందుకు అంతలా రెడీ అయి కూర్చుంది అని ఆరా తీశారు. తీరా ఆ వీడియోలో శ్రియ మాట్లాడింది చూస్తే.. అందంగా కనిపించడానికి.. తాను పెట్టుకున్న డ్రిప్ అని చెప్పుకొచ్చింది. ఇంత అందంగా ఉన్న ఇప్పటికి కూడా ఎందుకు.. మళ్లీ ఇంతలా బ్యూటీ కోసం ఇంతలా తాపత్రేయపడుతోంది…అంటూ.. తల పట్టుకొని అయ్యో అంటున్నారు ఆమె అభిమానులు.