Priyanka Chopra on Womens virginity: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మహిళలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి. మహిళ అయి ఉండి కూడా సాటి.. మహిళలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 29 మూవీలో నటిస్తున్నారు. అయితే.. ఈమూవీకి ఇప్పటికే హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబును అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల ప్రియాంక చోప్రా హైదరబాద్ కు వచ్చారు. అంతేకాకుండా.. చిలుకూరు బాలాజీని దర్శజనం చేసుకున్నారు. అదే విధంగా దోమకొండ శివాలయంకు కూడా వెళ్లి దర్శనం చేసుకున్నారు. స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు. అయితే.. ఈ దర్శనం మెగా కోడలు ఉపాసన ఈ దర్శనాలు అయ్యేలా ఏర్పాట్లు చేశారు.
అయితే.. తాజాగా... నటి ఎస్ఎస్ఎంబీ 29 సినిమాలో నటిస్తున్నారు. మరీ ఈ మూవీలో జక్కన్న.. ప్రియాంక చోప్రాకు హీరోయిన్ పాత్ర కోసం తీసుకున్నారో.. లేదా మరొ పవర్ ఫుల్ పాత్రలో తీసుకున్నారో మాత్రం ఇంకా మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వలేదు.
ఈ మూవీ సీన్ లను హైదరాబాద్ లో పూర్తయిన తర్వాత.. విదేశాలలో సీన్ ల కోసం మూవీ వెళ్లనున్నట్లు సమాచారం.దీనిలో మహేష్ బాబు..ప్రపంచ దేశాలను సంచరించే యాత్రికుడి పాత్రలో ఉండనున్నట్లు టాక్ విన్పిస్తుంది. ఈ క్రమంలో ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి.
ప్రియాంక చోప్రా.. తాజాగా.. తన ట్విట్ లో.. చాలా మంది తమకు కాబోయే భార్యలు వర్జీన్ గా రావాలని కోరుకుంటారని.. కానీ వర్జీన్ అనేది అంత ముఖ్యంకాదని.. తమను అర్థం చేసుకొని, నచ్చిన విధంగా ఉండే మహిళ జీవిత భాగస్వామి రావాలని కోరుకొవాలని ట్విట్ చేసింది.
అంతటితో ఆగకుండా.. వర్జీనీటీ అనేది ఒక్కరాత్రిలో పొతుందని.. దాని కోసం పెద్దగా పట్టించుకొవద్దని కూడా కాంట్రవర్సీగా మాట్లాడింది. దీంతో ఈ వివాదం ప్రస్తుతం పీక్స్ కు వెళ్లింది. దీనిపై ఇండస్ట్రీలో కూడా చాలా మంది ప్రియాంక చోప్రా వ్యాఖ్యలకు కౌంటర్ లు ఇస్తున్నారు.
సోషల్ మీడియాలో చాలా మంది మరీ అమ్మాయిలు కూడా.. అబ్బాయిల ప్యాకేజీలు, ప్రాపర్టీలు చూసి కాకుండా.. మంచి మనసున్న వాడ్ని పెళ్లి చేసుకొవాలని.. ప్రియాంక చోప్రాకు కౌంటర్ లు ఇస్తున్నారు. మరికొందరు ప్రియాంక చోప్రా గతంలో.. అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ లతో యవ్వారం నడిపింది.
చివరకు అమెరికాలో ఉండే..నిక్ జోనస్ తో సెటిల్ అయ్యింది. అటువంటి ఆమె వర్జీనిటీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మరికొందరు కౌంటర్ లు వేస్తున్నారు. మొత్తంగా ప్రియాంక చోప్రా మహిళలపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట కాంట్రవర్సీగా మారాయి. ఒక మహిళ అయి ఉండి కూడా.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని కూడా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.