Asin: అసిన్ మోసం గురించి బయటపెట్టిన స్టార్ నటుడు.. ఏకంగా అలాంటి పనులు చేసిందంటూ వ్యాఖ్యలు

Asin controversy : హీరో హీరోయిన్స్.. ప్రేమ కథలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి అన్న సంగతి తెలిసిందే. అయితే గజినీ సినిమాతో స్టార్ హీరోయిన్గా స్టేటస్ సంపాదించుకున్న అసిన్ గురించి.. ఒక స్టార్ నటుడు చేసిన వ్యాఖ్యలు ఒకప్పుడు అందరినీ షాక్ కి గురిచేసాయి..
 

1 /6

నటి అసిన్ దక్షిణ భారతదేశం నుండి బాలీవుడ్‌ వరకు తన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. కానీ ఆమె సినీ ప్రయాణంలో.. కొన్ని కాంట్రవర్సీలు కూడా ఎదుర్కొంది.   

2 /6

అసిన్ తన సినీ జీవితం మలయాళ చిత్రాలతో ప్రారంభించి, తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో కూడా నటించింది. "గజినీ" సినిమా ద్వారా బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన ఆమె అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది.  

3 /6

తన కెరీర్‌ మధ్యలో అసిన్ బాలీవుడ్ నటుడు.. నితిన్ ముఖేష్‌తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. వారు కొంతకాలం డేటింగ్ చేశారు. కానీ, ఈ ప్రేమలో కొన్ని ప్రతికూల పరిణామాలు జరిగాయి. అసిన్ వారి సంబంధాన్ని గోప్యంగా ఉంచాలని కోరుకోగా, నితిన్ ముఖేష్ దీన్ని బహిరంగంగా వెల్లడించాడు.  

4 /6

మీడియా ముందు అసిన్‌పై ఆరోపణలు చేస్తూ, ఆమె తనను మోసగించిందని నితిన్ వ్యాఖ్యానించాడు.  'అసిన్ ఒక మోసగత్తె. ఆమె నా దగ్గర చాలా సహాయం తీసుకుంది. నేను ఆమెకు చాలా డబ్బు కూడా సహాయం చేశాను. ఇలాంటి పనులు చేసింది.. కానీ ఇప్పుడు ఆమె అందనంత ఎత్తులో ఉంది' అంతు చెప్పుకొచ్చారు.  ఈ ఘటన తర్వాత అసిన్ బాలీవుడ్‌ ప్రాజెక్టుల పరంగా కూడా కష్టాలను ఎదుర్కొంది.  

5 /6

కాగా 2016లో వ్యాపారవేత్త రాహుల్‌తో ప్రేమ వివాహం చేసుకున్న అసిన్ సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం కుటుంబ జీవితం గడుపుతూ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది.  

6 /6

అసిన్ కెరీర్‌లో ఎన్నో విజయాలు, విజయవంతమైన సినిమాలు ఉన్నా, ఆమె ప్రేమకథ మాత్రం వివాదాస్పదంగా ముగిసింది. కానీ ఆమె ఇప్పుడు తన కుటుంబంతో ఆనందంగా జీవిస్తోంది.