Niharika: అతన్ని ప్రేమిస్తున్నాను.. మా మధ్యలోకి రావద్దండి: మెగా డాటర్ నిహారిక

Niharika Love Story: మెగా డాటర్ నిహారిక కొణిదెల మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ లో చేసిన ఒక మెసేజ్.. ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.  ఇంతకీ అసలు ఆ మెసేజ్ ఏమిటి అన్న విషయం ఒకసారి చూద్దాం..

1 /5

మెగాస్టార్ కుటుంబంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొణిదెల ఇటీవల తన వ్యక్తిగత జీవితంతో మరోసారి వార్తల్లో నిలిచింది. నాగబాబు కుమార్తెగా, టాలీవుడ్‌లో తనదైన గుర్తింపును పొందిన నిహారిక.. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ అందరిని ఆకట్టుకుంటుంది. 

2 /5

నిహారిక తొలుత యాంకర్‌గా, తరువాత హీరోయిన్‌గా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. అయితే నటిగా పెద్దగా విజయాలు సాధించలేకపోయినా.. వెబ్‌సిరీస్‌లు, నిర్మాతగా తనదైన మార్గాన్ని ఏర్పరుచుకుంది. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిహారిక, కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఎదురుచూస్తోంది.  

3 /5

ఈ క్రమంలో..ఇటీవల నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ ఆసక్తికర చర్చలకు దారి తీసింది. “నేను అతడిని ప్రేమిస్తున్నాను.అంబటి భార్గవి మా ఫ్రెండ్‌షిప్ మధ్యలోకి నువ్వు రావద్దు. ఒకేనా ధన్యవాదాలు” అంటూ షేర్ చేసిన మెసేజ్‌తోపాటు, రెడ్ హార్ట్ ఎమోజీలను జతచేసింది. అయితే ఈ పోస్ట్‌ ఎవరికోసం? అనే విషయం వెల్లడించలేదు.  

4 /5

అసలు విషయానికి వస్తే.. ఒక బుద్దోడి రాసుకున్న నోట్స్ లోని ఒక పేజీ షేర్ చేసింది నిహారిక. అందులో ‘తను మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్.. కాదు నా బెస్ట్ ఫ్రెండ్..’అని ఇంగ్లీషులో రాసి ఉంది. ఈ పోస్ట్ ని షేర్ చేస్తూనే పైన మెసేజ్ పెట్టింది నిహారిక. మరి ఇదేదన్నా సినిమా ప్రమోషన్స్ కోసమా లేకపోతే తనకు తెలిసిన చిన్న బాబు నోట్స్ షేర్ చేసిందా అనేది తెలియాల్సి ఉంది.

5 /5

కాగా గతంలో నిహారిక పెళ్లయి విడాకుల తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత.. ఈ హీరోయిన్ సినిమాలతో బిజీగా మారిపోయింది. మరి ఈమె మళ్లీ ప్రేమలో పడే ఆలోచన ఉందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.