Pooja Hegde Dating: టీమిండియా స్టార్ క్రికెటర్‌తో పూజా హెగ్డే పెళ్లి రూమర్లు.. ఎక్కువగా ప్రేమలో పడ్డానంటున్న బుట్టబొమ్మ

Pooja Hegde Marriage Rumours: ఒక లైలా కోసం మూవీతో తెలుగు తెరకు పరిచయమై.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన ఈ భామ.. వరుసగా చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. షాహిద్ కపూర్‌తో జంటగా నటించిన దేవ మూవీ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. సినిమాల విషయం పక్కనబెడితే.. ఈ బ్యూటీ స్టార్ క్రికెటర్‌తో ప్రేమలో పడినట్లు రూమర్లు వస్తున్నాయి.
 

1 /7

స్టార్ క్రికెటర్‌తో పూజా హెగ్డే ప్రేమలో ఉందని.. త్వరలోనే చేసుకోబోనుందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలో వాస్తవం ఎంతో తెలీదు గానీ.. ఆ క్రికెటర్ పేరు మాత్రం తెరపైకి రాలేదు. ఈ రూమర్స్ గతం నుంచి ఉన్నా.. మరోసారి వైరల్ అవుతున్నాయి.  

2 /7

దేవ మూవీ రిలీజ్ సందర్భంగా ఈ టాలీవుడ్ భామ.. తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. సౌత్‌తోపాటు హిందీలో వరుసగా అవకాశాలు వస్తున్నాయని.. రెండు ఇండస్ట్రీలను బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగానే ఉందని చెప్పుకొచ్చింది.  

3 /7

తన కెరీర్‌ ప్రారంభంలోనే బాగానే సాగిందని.. ప్రస్తుతం కొంచెం హెచ్చుతగ్గులతో సాగుతోందని చెప్పింది బుట్టబొమ్మ. తాను సినీ కుటుంబం నుంచి రాలేదు కాబట్టి.. తనకు ప్రతిదీ ఒక అద్భుతమేనని తెలిపింది.  

4 /7

తాను తొలి రోజు ఎలాంటి అనుభుతి చెందానో.. ఇప్పుడు అలాంటి ఫీలింగ్‌తోనే ఉంటానంది. తాను సినిమాలతో ఎక్కువగా ప్రేమలో పడ్డాననిపిస్తోందని చెప్పింది.  

5 /7

తాను ఎప్పుడు డిఫరెంట్ రోల్స్ పోషించాలని అనుకుంటానని.. అందుకే దేవా కథ రాగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని.. తాను జర్నలిస్ట్ రోల్ పోషించినట్లు పేర్కొంది.  

6 /7

అనుకోకుండా తాను సినీ ఇండస్ట్రీకి వచ్చానని.. దాదాపు దశాబ్ద కాలం గడిచిపోయిందని చెప్పింది. తాను చాలా దూరం వచ్చానని.. ఇంకా ప్రయాణించాల్సింది ఉందని చెప్పుకొచ్చింది.   

7 /7

అయితే సినీ ప్రయాణం గురించి చెప్పిన బుట్టబొమ్మ.. పెళ్లి విషయం గురించి మాత్రం చెప్పలేదు. గుడ్‌న్యూస్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.