Producer SKN Comments: బేబీ మూవీ నిర్మాత ఎస్‌కేఎన్ చేసిన కామెంట్స్ తీవ్ర దూమరం రేపుతున్నాయి. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయమని ఆయన చెప్పిన మాటలపై విమర్శలు వస్తున్నాయి. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తనకు తెలిసొచ్చిందన్నారు. ఈ కామెంట్స్‌పై ఎస్‌కేఎన్‌కు ఓ హీరోయిన్ మిడిల్ ఫింగర్ అంటూ కౌంటర్ ఇచ్చింది.
బేబీ మూవీలో తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్యకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. వైష్ణవి పాత్రలో ఆమె అద్బుతంగా నటించి.. సినిమాకు ప్రాణం పోసింది.
వైష్ణవి చైతన్య నటనకు అన్ని వైపులా నుంచి ప్రశంసలు దక్కాయి. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఎస్‌కేఎన్.. ఈ సినిమా హీరోయిన్ కాయాదు లోహర్‌పై అభ్యంతరకరంగా మాట్లాడాడు. ఆమె పేరును వాడుతూ డబుల్ మీనింగ్‌లో మాట్లాడి కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు.
ఈ సందర్భంగా బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేశాడు. తెలుగులో తెలుగు రాని అమ్మాయిలనే ఎంకరేజ్ చేస్తామని.. తెలుగు రాని అమ్మాయినే ఎక్కువగా తాము లవ్ చేస్తామన్నాడు. ఎందుకంటే తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమతుందో తనకు తెలిసొచ్చిందన్నాడు. ఇక నుంచి తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని తాను, డైరెక్టర్ సాయి రాజేష్ అనుకుంటున్నామన్నాడు.
ఎస్‌కేఎన్ వ్యాఖ్యలపై హీరోయిన్ రేఖా భోజ్ ఫైర్ అయ్యారు. "ఇప్పుడేదో తెగ ఇచ్చేస్తున్నట్టు.. పోరా. పతివోడు పేద్ద ఉద్దరించేసినట్టు ఎదవ బిల్డప్పులు. ఒక రకంగా ఇది తెలుగు అమ్మాయిల మీద అఫిషియల్‌గా బ్యాన్ అనౌన్స్ చేసినట్టే. మా బ్రతుకు తెరువు మీద కొట్టేలా మాట్లాడాక ఇక మీకేంటి ఇచ్చేది గౌరవం.. మిడిల్ ఫింగర్." అంటూ కౌంటర్ ఇచ్చింది.