Actress betraya news: వారందరూ నన్ను వాడుకొని మోసం చేశారంటున్నా స్టార్ హీరోయిన్..!

Actress shocking statement: సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎంతో పేరు తెచ్చుకుంది హీరోయిన్ జయప్రద. అయితే తాను నమ్ముకున్న వాడే తనను ఎంతో మోసం చేశారని. అందరూ కూడా తనని వాడుకొని వదిలేసాడు అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది ఈ నటి. పూర్తి వివరాల్లోకి వెళితే..

1 /5

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది ప్రముఖ సీనియర్ హీరోయిన్ జయప్రద.  తన అందంతో,  నటనతో శ్రీదేవితో పోటీ పడుతూ సినిమాలలో అవకాశాలు దక్కించుకునేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో 1962 ఏప్రిల్ 3న ఒక మధ్యతరగతి కుటుంబంలో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది జయప్రద. 

2 /5

బాల్యంలో డాక్టర్ అవ్వాలనుకునేదట జయప్రద. కానీ ఈమె తల్లి జయప్రద ఏడవ ఏటనే నాట్య సంగీత శిక్షణకు పంపిందట.  ఇక తన తండ్రి బాబాయిలు సినిమా పెట్టుబడిదారులైనప్పటికీ ఈమెకు సినీ రంగ ప్రవేశం వారి ద్వారా లభించలేదు. 14 సంవత్సరాల వయసులో స్కూల్లో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా.. సినీనటుడు M. ప్రభాకర్ రెడ్డి ఈమెను చూసి ఈమెకు జయప్రద అని నామకరణం చేసి 1976లో విడుదలైన భూమికోసం అనే సినిమాలో మూడు నిమిషాల నిడివి ఉన్న ఒక పాట ద్వారా ఇండస్ట్రీకి ఈమెను పరిచయం చేశారు.

3 /5

అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు దాదాపు మూడు దశాబ్దాలలో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, బెంగాలీ , కన్నడ మొత్తం ఆరు భాషలలో 300కు పైగా సినిమాలలో నటించింది. సీనియర్ ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు 1994 అక్టోబర్ 10 న తెలుగుదేశం పార్టీలోకి చేరి, రాజకీయరంగ ప్రవేశం చేసిన ఈమె చంద్రబాబు నాయుడు పక్షంలో తెలుగుదేశం పార్టీలో మహిళా విభాగానికి అధ్యక్షురాలు అయింది. ఆ తర్వాత పార్టీలో వచ్చిన గొడవల కారణంగా తెలుగుదేశం పార్టీని వీడి మూలాయం సింగ్ యాదవ్ సమాజ్ పార్టీలో చేరింది. 

4 /5

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. చివరి శ్వాస వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఉంటానని,  తెలుగు ఇండస్ట్రీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.  అదే ఇంటర్వ్యూలో నమ్మినవాళ్లే మోసం చేశారని కూడా తెలిపింది. “నేను ఎలా ఉంటానో ఎదుటి వాళ్లు కూడా నాలాగే ఉంటారని అనుకునేదాన్ని.  కానీ వాళ్ళు నన్ను అమ్మేసి, బయట అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని తెలిసింది. ముఖ్యంగా ఫ్రెండ్స్,  రిలేటివ్స్ అందర్నీ చాలా గుడ్డిగా నమ్మాను. అందరూ కూడా నా పేరు వాడుకొని నన్ను మోసం చేశారు. ఈ విషయాలన్నీ కూడా గతంలో తెలిసేవి కాదు. ముఖ్యంగా రాజకీయరంగంలో మాటల్లోనే జయప్రదను అమ్మేసేవాళ్లు. వాళ్లు నా దగ్గర కపట బాధలు చెప్పుకుంటుంటే.. అయ్యో పాపం వాళ్ళకి కష్టం వచ్చింది అని చెప్పి డబ్బులు తీసి ఇచ్చేసేదాన్ని. ఇక తర్వాత తెలిసింది వాళ్లంతా కూడా డబ్బుల కోసమే అలా మాట్లాడారని. చాలా దగ్గరి స్నేహితులు, బంధువులు కూడా అలా చేశారు. కానీ ఇప్పుడు నేను అలర్ట్ అయ్యాను. ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాతనే ముందడుగు వేస్తున్నాను,” అంటూ జయప్రద తెలిపింది.

5 /5

అలాగే రాజేంద్రప్రసాద్ తో సినిమాలలో నటించకపోవడానికి గల కారణాన్ని కూడా ఆమె చెప్పుకొచ్చింది. దాదాపు 35 సంవత్సరాలు అయిపోయింది ఆయనతో మళ్ళీ నటించే అవకాశం రాలేదు. కనీసం కలిసిన సందర్భాలు కూడా లేవు. ఆయన చాలా గొప్ప నటుడు అంటూ తెలిపింది.