Vijayashanthi personal life: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లేడీ అమితాబ్ గా పేరు సొంతం చేసుకున్న విజయశాంతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈమె ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటూ స్టార్ హీరోలతో సమానంగా పోటీపడింది. అంతేకాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కోటి రూపాయలు పారితోషకం అందుకున్న మొట్టమొదటి హీరోయిన్ కూడా ఈమె కావడం గమనార్హం.
విజయశాంతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమాల ద్వారా.. రాజకీయాల ద్వారా ఎంతో పేరు తెచ్చుకుంది ఈ హీరోయిన్.కర్తవ్యం ,ఒసేయ్ రాములమ్మ లాంటి చిత్రాలు విజయశాంతికి మంచి పేరు తీసుకొచ్చాయి. ఇదిలా ఉండగా విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కి నందమూరి కుటుంబానికి మధ్య బంధుత్వం వుందట. అది ఏ విధంగానో ఇప్పుడు చూద్దాం.
విజయశాంతి అనగానే యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలే కాదు ఆమె ఒలికించిన శృంగార పాత్రలు కూడా గుర్తుకొస్తాయి.. అటు పర్ఫామెన్స్ ఓరియంటెడ్ మూవీలో నటిస్తూనే ఇటు గ్లామర్ డాల్ గా కూడా సత్తా చాటి విశ్వ నట భారతి గా పేరు సొంతం చేసుకుంది. 1964 జూన్ 24న వరంగల్లో జన్మించిన ఈమె అసలు పేరు శాంతి. తన పిన్ని పేరు నుంచి విజయాను తీసుకుని విజయశాంతి గా మారింది.
అలా హీరోయిన్గా విజయశాంతి మొదటి సినిమా 1979లో వచ్చిన తమిళ చిత్రం కల్లుక్కుల్ ఈరమ్. కేవలం 15 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది.
ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకున్న ఈమె భర్త ఎవరో కాదు ఎన్టీఆర్ పెద్దల్లుడు .. గణేష్ రావు కి స్వయాన మేనల్లుడు అవుతారు. ఈయనకు, హీరో బాలకృష్ణకు మంచి స్నేహబంధం ఉండేది. ఆ స్నేహంతోనే బాలకృష్ణతో ఒక సినిమా చేయాలనుకున్నారు. అందులో భాగంగానే బాలకృష్ణతో కలిసి యువరత్న ఆర్ట్స్ స్థాపించి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిప్పురవ్వ సినిమాను తెరకెక్కించారు.. ఇందులో హీరోయిన్ గా పలువురు పేర్లను పరిశీలించి చివరికి విజయశాంతిని ఎంపిక చేశారు.
ఈ సినిమాను నిర్మించేటప్పుడు శ్రీనివాస్ ప్రసాద్ స్వయంగా విజయశాంతి దగ్గరకు వెళ్లి ఈ సినిమాలో నటించడానికి ఒప్పించారు. అలా వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి ,పెళ్లికి దారి తీసింది. ఇకపోతే నిప్పురవ్వ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ - శ్రీనివాస్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని, అందుకే ఈయనకు పోటీగా మరో సినిమా బంగారు బుల్లోడు పోటీగా దింపారట బాలకృష్ణ. ఈ పోటీల్లో బంగారు బుల్లోడు హిట్గా నిలవగా.. నిప్పురవ్వ యావరేజ్ గా నిలిచింది. విజయశాంతి - బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా కూడా ఇదే కావడం గమనార్హం.