Muthyalamma idol incident: లేడీ నాగ సాధుమాత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి రోజు శుక్రవారం ముత్యాలమ్మ ఆలయం దగ్గరకు వెళ్లి ఆత్మార్పణ చేసుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు.
లేడీ నాగసాధు మాత దీపావళి రోజు ముత్యాలమ్మ ఆలయం దగ్గరకు వెళ్లి ఆత్మర్పణం చేసుకుంటానని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో హైదరబాద్ లో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
అఘోరీ మాత మళ్లీ హైదరబాద్ కు చేరుకున్నట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. ప్రస్తుతం తాను.. కొండగట్టుకు, ఏడుపాయలకు, కొమురవెల్ళికి వెళ్తున్నానని చెప్పారు. ముత్యాలమ్మ ఘటనపై హిందువులు ఎవరు స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు
సనాతన ధర్మం కోసం తాను ఆత్మర్పణ చేసుకుంటానని, దీనితో అయిన హిందువుల్లో కనువిప్పు కల్గలాని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఒక్కసారిగా హైదరబాద్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకొవచ్చు.
దీపావళి రోజు అంటే శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గరకు వెళ్లి ఆత్మర్పణం చేసుకుంటానని లేడీ అఘోరీ మాత ఎమోషనల్ గా మాట్లాడారు. ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాంను ధ్వంసం చేసిన ఒక వర్గానికి చెందని వ్యక్తికి పోలీసులు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని విమర్శించారు
మరోవైపు రాజకీయ నాయకులు సైతం కేవలం.. ఓట్ల కోసం మాత్రమే ప్రజల్ని ఉపయోగించుకుంటున్నారని ప్రధాని మోదీ, రేవంత్ ను సైతం విమర్శిస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో 163 సెక్షన్ ను సీపీ సీవీ ఆనంద్ విధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం లేడీ అఘోరీ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో ఒక్కసారిగా పండగ రోజు ఏం జరుగుతుందో అంటూ కొంది మంది ఆందోళనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొందరు మాత్రం.. ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయకుండా సామరస్యంగా సమస్యల్ని పరిష్కరించుకొవాలని కూడా కోరుతున్నారు. మొత్తానికి లేడీ అఘోరీ మళ్లీ తెలంగాణలో కాలు పెట్టి రచ్చకు కారణమైందని చెప్పుకొవచ్చు.