Healthy Liver: మందుకు బానిసై లివర్ పాడయిందా, ఈ 5 ఫుడ్స్ తింటే మళ్లీ లివర్ సెట్ అయిపోతుంది

మద్యపానం ఆరోగ్యానికి హానికారకమని, లివర్ ఫెయిల్యూర్ అవుతుందని అందరికీ తెలిసిందే. అతిగా మద్యపానం సేవించేవారి లివర్ త్వరగా పాడయిపోతుంది. ఈ పరిస్థితుల్లో లివర్ ను సంరక్షించుకోవాలంటే ముందు మద్యపానం మానేయాలి. ఆ తరువాత కొన్నిహెల్తీ ఫుడ్స్ తీసుకుంటే లివర్ తిరిగి హెల్తీగా మార్చుకోవచ్చు.

Healthy Liver: మద్యపానం ఆరోగ్యానికి హానికారకమని, లివర్ ఫెయిల్యూర్ అవుతుందని అందరికీ తెలిసిందే. అతిగా మద్యపానం సేవించేవారి లివర్ త్వరగా పాడయిపోతుంది. ఈ పరిస్థితుల్లో లివర్ ను సంరక్షించుకోవాలంటే ముందు మద్యపానం మానేయాలి. ఆ తరువాత కొన్నిహెల్తీ ఫుడ్స్ తీసుకుంటే లివర్ తిరిగి హెల్తీగా మార్చుకోవచ్చు.

1 /6

ఓట్ మీల్ ఓట్ మీల్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతోపాటు లివర్ ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుంది.

2 /6

లివర్ సంరక్షణకు 5 కీలక పదార్ధాలు శరీరంలో అన్ని రకాల ఫ్యాట్స్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లను కంట్రోల్ చేయడం లివర్ ద్వారానే అవుతుంది. కొన్ని హెల్తీ ఫుడ్స్ తింటే లివర్ పటిష్టం చేయవచ్చు. లివర్ ఆరోగ్యంగా లేకుంటే మెటబోలిక్ డిజార్డర్ తలెత్తవచ్చు. ఇందులో టైప్ 2 డయాబెటిస్ ముఖ్యమైంది. 

3 /6

ఆకుకూరలు రోజూ నియమిత మోతాదులో ఆకు కూరలు తింటే శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. అటు లివర్ కు కూడా చాలా లాభాలు కలుగుతాయి. దీనికోసం పాలకూర, తోటకూర, అరటి, కాలిఫ్లవర్, బ్రోకలీ తీసుకోవాలి

4 /6

ఆలివ్ ఆయిల్ ఇండియాలో ఆయిలీ ఫుడ్స్, శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఫుడ్స్, జంగ్ ఫుడ్స్ అధికంగా తీసుకుంటున్నారు. దాంతో లివర్ పాడవుతోంది. ఈ క్రమంలో కుకింగ్ ఆయిల్ మార్చాల్సి ఉంటుంది. సాధారణ కుకింగ్ ఆయిల్ స్థానంలో ఆలివ్ ఆయిల్ లేదా జైతూన్ ఆయిల్ వాడటం మంచిది.

5 /6

ద్రాక్ష రోజూ క్రమం తప్పకుండా ద్రాక్ష తినడం ప్రారంభిస్తే లివర్ తప్పకుండా ఆరోగ్యవంతంగా మారుతుంది. ఆ ప్రబావం మీకు వివిధ రూపాల్లో కన్పిస్తుంది. 

6 /6

గ్రీన్ టీ ఒక రోజులో 2 సార్లు గ్రీన్ టీ తాగితే లివర్ కేన్సర్ నుంచి రక్షించుకోవచ్చంటారు. అయితే గ్రీన్ టీ అవసరానికి మించి తాగకూడదు.