OLD Pension Scheme Updates in Telugu: ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం నుంచి శుభవార్త అందనుంది. ఉద్యోగుల పెన్షన్ పధకంలో మార్పులు చేర్పులు చేస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగులకు తిరిగి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌నే అమలు చేసేందుకు సిద్ధమౌతోందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OLD Pension Scheme Updates in Telugu: ఉద్యోగుల డిమాండ్, ఆందోళన నేపధ్యంలో ఇప్పటికే దేశంలోని పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢజ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తున్నారు. త్వరలో తమిళనాడులో కూడా పాత పెన్షన్ విధానం వస్తుందని అంచనా ఉంది.
తమిళనాడులోని ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే 2022లో అప్పటి ఆర్ధిక మంత్రి పళనివేల్ మాత్రం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయలేమని స్పష్టం చేశారు.
పాత పెన్షన్ స్కీమ్ అమలు చేస్తే ఒక్కొక్క వ్యక్తికి ఏడాదికి 2 లక్షల రూపాయలవుతుందని, కానీ కొత్త పెన్షన్ విధానంలో 50 వేలే అవుతుందన్నారు. అందుకే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయలేమన్నారు.
ఇప్పుడు మళ్లీ తమిళనాడులో పాత పెన్షన్ విధానం అమలు చేయాలనే డిమాండ్ వస్తోంది. ఇప్పటి ఆర్ధిక మంత్రి ఆ నిర్ణయాన్ని తీసుకుంటారా లేదా అనే ప్రశ్న విన్పిస్తోంది. ఆయన ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌పై చాలా అంచనాలున్నాయి.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో పాత పెన్షన్ విధానం అమలు ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆర్ధిక మంత్రి తెలిపారు.
త్వరలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చిన సంగతిని ఉద్యోగ సంఘాలు గుర్తు చేశాయి. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాత పెన్షన్ విధానం అమలుపై డీఎంకే హామీ ఇచ్చింది.
పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.
పాత పెన్షన్ విదానంలో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు నెల జీతంలో సగం అందుతుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఉద్యోగుల పెన్షన్ నుంచి 10 శాతం కంట్రిబ్యూషన్ తీసివేస్తారు. ఈ పది శాతాన్ని పెన్షన్ ఫండ్‌లో కలుపుతారు. అదే 10 శాతాన్ని ప్రభుత్వం కలుపుతుంది.