AP Inter Holidays Reduce: ఏ విద్యార్థులు అయినా పరీక్షలు అయిపోయాయి అనగానే ఎగిరిగంతేస్తారు. ఎందుకంటే సమ్మర్ సెలవులు కూడా మొదలవుతాయి. ఈ నేపథ్యంలో వారికి నెల పైగా సెలవులు కూడా వస్తాయి. అయితే వచ్చే ఏడాది ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సెలవులు కుదించనున్నారు. ఇది విద్యార్థులకు వెరీ బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటర్ క్లాసులు మొదలవుతాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు పూర్తవగానే సమ్మర్ హాలిడేస్ మొదలై పోతాయి. ఆ తర్వాత జూన్ నెలలో తిరిగి క్లాసులు ప్రారంభమవుతాయి. అయితే వచ్చే ఏడాది ఈ విధానంలో మార్పు ఉంటుంది. ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
సీబీఎస్‌ఈ తరహాలో ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులు కూడా ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇది వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేసే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ఇది విద్యార్థులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. దీంతో విద్యార్థులకు సెలవులు తగ్గిపోతాయి.
పోటీ పరీక్షకు సంబంధించి ఏప్రిల్ 22వ తేదీ నుంచి వరకు క్లాసులు నిర్వహించి.. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఇవ్వనున్నారు. అయితే గతంలో అయితే పరీక్షలు పూర్తయిన వెంటనే సెలవులు ఇచ్చేది. ఎండాకాలం పూర్తయిన తర్వాతే స్కూల్ కాలేజీలు పునః ప్రారంభం అయ్యేవి.
కానీ ఏపీ ఇంటర్ బోర్డులో కీలక మార్పులు చోటు చేసుకోవడంతో వచ్చే ఏడాది నుంచి సెలవులను కుదించే దిశగా విద్యాశాఖ ఆలోచిస్తుంది. సీబీఎస్‌ఈ తరహాలో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ పూర్తయిన వెంటనే మళ్ళీ క్లాసులోనూ ప్రారంభిస్తుంది. ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
మార్చి 1వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది. మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించారు.