AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..

AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని వాళ్లు పులికించిపోయే న్యూస్ అందించింది.

1 /7

AP Liquor: ఆంధ్ర ప్రదేశ్ గత ప్రభుత్వం హయాములో జే బ్రాండ్ అంటూ అంత క్వాలిటీ లేని సరకును అమ్మడంపై అప్పట్లో మందు బాబులకు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.

2 /7

అది ఓట్ల రూపంలో చూపించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో మిగతా ప్రజలతో పాటు మందు బాబుల పాత్ర కూడా ఉంది.  

3 /7

ఇప్పటికే కొత్త మద్యం పాలసీలో భాగంలో ప్రభుత్వ దుకాణాలు కాకుండా ప్రైవేటుగా మద్యం షాపులకు లాటరీ విధానంలో టెంటర్స్ పిలిచారు. అంతేకాదు లాటరీ విధానంలో ఎంపికైన వారికీ షాపులు కేటాయించారు.

4 /7

ఇప్పటికే తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న బ్రాండ్లను ప్రవేశ పెట్టింది. దీంతో పాటు తక్కువ ధరకు అంటే రూ. 99  కే లిక్కరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే కదా.

5 /7

అంతేకాదు పండగ వేళ మద్యం షాపుల్లోకి మరిన్ని కొత్త బ్రాండ్స్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ఎక్సైజ్ మంత్రి తెలిపారు. ప్రస్తుతం అతి తక్కువ రేటుకే మద్యం అందిస్తున్నామని చెప్పారు.

6 /7

అంతేకాదు త్వరలో మందు రేట్లు తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అందుకోసం ఓ కమిటీ కూడా ఫామ్ చేసినట్టు చెప్పారు.

7 /7

అంతేకాదు మద్యాన్ని కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుగా చూటటం లేదంటున్నారు. మొత్తంగా పండగ వేళ ఏపీ ప్రభుత్వం చెప్పిన ఈ న్యూస్ తో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు.