DA Hike Bonus Salary: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి డబుల్ ధమాకా.. భారీగా జీతాల పెంపు..!

Diwali Bonus and DA Hike to Govt Employees: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. ఈ నేపథ్యంలో పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతోపాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు డీఏ, బోనస్‌లు ప్రకటించాయి. డియర్‌నెస్ అలవెన్స్ పెంపు, బోనస్‌తో ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి భారీగా డబ్బులు జమకానున్నాయి. ఈ దీపావళికి ఉద్యోగుల ఆనందం రెట్టింపు కానుంది. ఏ రాష్ట్రం ఎంత డీఏ, గ్రాట్యుటీ పెంచాయో ఇక్కడ తెలుసుకుందాం..
 

1 /7

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలలో ఒకటి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగులకు కాస్త ఊరట కలిగించినట్లయింది.   

2 /7

తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగులకు గ్రాట్యుటీ ప్రకటించింది. 53 శాతం గ్రాట్యూటీ ప్రకటించిన స్టాలిన్ సర్కార్.. జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించింది.   

3 /7

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉద్యోగులకు బంపర్ న్యూస్ ప్రకటించారు. గ్రాట్యుటీ పెంపుతో పాటు దీపావళి బోనస్‌ను కూడా అందజేస్తామన్నారు. దీంతో ఉద్యోగులకు ఒక నెల అదనపు జీతం అందనుంది.  రూ.7 వేల వరకు బోనస్ కూడా ప్రభుత్వం అందజేయనుంది.  

4 /7

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ క్లాస్ IV ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. రూ.7 వేల వరకు పండుగ బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఉద్యోగులకు 3 శాతం గ్రాట్యుటీ పెంచుతున్నట్లు తెలిపారు.   

5 /7

అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుక అందజేసింది. గ్రాట్యుటీలో 3 శాతం అందిస్తున్నట్లు ప్రకటించింది.   

6 /7

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మోదీ సర్కారు బంపర్ గిఫ్ట్ ఇచ్చింది. 3 శాతం డీఏ పెంచుతూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా వివిధ శాఖల ఉద్యోగులకు నెల జీతానికి సమానమైన నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ అందజేస్తున్నట్లు ప్రకటించింది.

7 /7

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 53 శాతానికి చేరింది. జూలై 1వ తేదీ నుంచి అమలు చేసింది. దీంతో ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి భారీ మొత్తం డబ్బులు జమకానున్నాయి.