AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

AP Rain Alert: మరో రెండు వారాల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీఎస్‌డీఎంఏ ట్వీట్టర్ వేదికగా అలెర్ట్‌ చేసింది.
 

1 /5

మరో అల్పపీడన ముప్పు ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. బంగాళాఖాతంలో మరో పీడనం మరో వారంలో ఏర్పడుతుంది. దీని వల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ట్వీట్టర్ వేదికగా తెలియజేసింది.  

2 /5

గత నెలలో అల్పపీడనాలు ఏర్పడినాయి.దీనివల్ల ఏపీ, ఒడిశా, తమిళనాడు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసాయి. చెన్నై ప్రాంతం అతలాకుతలమైన సంగతి తెలిసిందే.  

3 /5

ఈ భారీ వర్షాల వల్ల ఏపీలో కూడా కొన్ని జిల్లాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరాయి. చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వం కొన్ని సహాయక చర్యలు చేపట్టారు.  

4 /5

ఈరోజు కూడా ముఖ్యంగా గుంటూరు, ఏలూరు, కృష్ణ, పల్నాడు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది.   

5 /5

రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాలు ప్రభావితం అవుతాయి. మరో అల్పపీడనం ఏర్పడినప్పుడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.