8th Pay Commission How Were Salary Hikes: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటు చేయడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు ఆనందంలో మునిగారు. అయితే గత పే కమిషన్‌లకు తాజా పే కమిషన్‌లలో ఏమేం మార్పులు జరిగాయో తెలుసుకోండి. దీనివలన మీకు పొందే లబ్ధి, ప్రయోజనాలు తెలుసుకోవచ్చు.
లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త వినిపించిన విషయం తెలిసిందే. 8వ వేతన సంఘం ఏర్పాటుచేస్తూ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు, పింఛన్‌దారుల్లో ఆనందం ఏర్పడింది. 1 జనవరి 2026లో పే కమిషన్ అమల్లోకి రానుందని సమాచారం.
కొత్తగా ఏర్పాటుచేసిన 8వ వేతన సంఘానికి గత పే కమిషన్‌లకు మధ్య ఏమేం మార్పులు జరిగాయో.. ఎలాంటి తేడాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాటి మధ్య వ్యత్యాసం, తేడాలు తెలుసుకుంటే ఉద్యోగులు, పింఛన్‌దారులు పొందే ప్రయోజనాలు తెలుస్తాయి.
7వ వేతన సంఘం 1 జనవరి 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 వద్ధ నిర్ధిష్టం చేశారు. ప్రాథమిక వేతనంతో 2.57తో గుణించడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అన్ని స్థాయిలలో జీతాలు పెరగడానికి దోహదం చేసింది.
7వ పే కమిషన్‌లో కనీస ప్రాథమిక వేతనం రూ.18 వేలుగా సిఫార్సు చేయగా.. 6వ వేతన సంఘం కింద గతంలో ఉన్న రూ.7 వేల పెరుగదలను సూచిస్తుంది. దీనివలన గతంలో కన్నా అధికంగా జీతం ఉద్యోగులు పొందగా.. పింఛన్‌దారులకు కూడా పింఛన్ ప్రయోజనం భారీగా పెరిగింది.
1 జనవరి 2006లో 6వ వేతన సంఘం ఏర్పాటు చేయగా భారీ మార్పులు జరిగాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.86 ఉండగా కనీస ప్రాథమిక వేతనం రూ.7 వేలుగా ఉంది. పింఛన్‌దారులు రూ.1,275 నుంచి రూ.3,500 పెరుగుదల జరిగింది.
కొత్త వేతన సంఘంతో గత పే కమిషన్‌ల కన్నా అధిక ప్రయోజనాలు ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు కలగనుంది. జీతాల పెంపుతోపాటు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, కనీస వేతనం, డీఏల్లో భారీగా పెరుగుదల ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ సమాచారం అవగాహన కోసం అందిస్తున్నది మాత్రమే. దీనిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు. అధికారిక సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లు.. కార్యాలయాలను సంప్రదించాలి.