APSSDC Latest Jobs: నిరుద్యోగ యువకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సంక్రాంతి తర్వాత అద్భుతమైన గుడ్‌న్యూస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన జాబ్ మేళాను నిర్వహించబోతున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. దీనిని జనవరి నెల 23 , 24 తేదీల్లో నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైంది.
ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి వివిధ రకాల ఆర్హతలు కూడా పేర్కొన్నారు. అయితే ఇందులో పాల్గొనాలనుకునేవారు తప్పకుండా 18 సంవత్సరాల వయస్సును కలిగి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా పదవ తరగతి నుంచి ఎం.ఫార్మసీ విద్యార్హతలు కలిగి ఉండాల్సి ఉటుంది. అంతేకాకుండా ఇతర విద్యార్హతలు కలిగిన వ్యక్తులు కూడా దీనికి ఆర్హులే..
వెంటనే ఉద్యోగం కావాలని, ఎక్కువ జీతంతో అద్భుతమైన ఉద్యోగం పొందాలనుకునేవారికి ఇది అద్భుతమై అవకాశంగా భావించవచ్చు. ఈ జాబ్ మేళాలో పాల్గొనే పొందవచ్చు. అన్ని అర్హత ఉన్నవారు స్వయంగా దీనికి హాజరు అయ్యే అవకాశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ కల్పిస్తోంది.
ఇక ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఈ నోటిఫికేషన్‌ను వెళ్లడించింది. వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకే ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది.
ఈ నోటిఫికేషన్‌లో ఖాళీల వివరాల్లోకి వెళితే.. త్వరలోనే నిర్వహించబోయే ఈ జాబ్ మేళలో భాగంగా తిరుపతి, కర్నూలుతో పాటు అన్నమయ్య జిల్లాల్లో ఉన్న వివిధ కంపెనీల్లో ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ తెలిపింది.
ఇక ఈ జాబ్ మేళలో భాగంగా ఎంపికైన వారికి కనీసం జీతం రూ.10,000 నుంచి రూ.35,000 వరకు ప్రారంభమవుతుంది. ఇందులో మొత్తం సంఖ్య 560 ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ జాబ్ మేళలో భాగంగా ప్రత్యేకమైన ఆర్హతలను కూడా పేర్కొన్నారు.