Asteroid Hit: ఖగోళానికి సంబంధించిన ఘటనలు ప్రతి నెలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. అయితే అక్టోబర్ నెల చాలా ప్రత్యేకం కానుంది. ఓ వైపు అతిపెద్ద ఆస్టరాయిడ్ భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్లనుంది. మరోవైపు సూర్య, చంద్ర గ్రహణాలు సంభవించనున్నాయి. ఇవి చాలదన్నట్టు విరిగిపడే చుక్కల వర్షం పడనుంది.
రెండు పెద్ద పెద్ద ఆస్టరాయిడ్లు బోయింగ్ విమానంలో పరిమాణంలో ఉన్నవి భూమికి సమీపం నుంచి వెళ్లిపోనున్నాయి.
అక్టోబర్ చివరి వారంలో అంటే 28వ తేదీన చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్ర గ్రహణం ఇండియాలో కన్పిస్తుంది. మద్యాహ్నం 2 గంటల 52 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 2 గంటల 22 నిమిషాల వరకూ ఉంటుంది.
తోకచుక్కల వర్షం అక్టోబర్ 9న జరగవచ్చు. ప్రతి గంటకు దాదాపు 400 తోకచుక్కలు విరిగిపడటాన్ని గమనించవచ్చు. నేరుగా కళ్లతో చూడవచ్చు. అక్టోబర్ 21-22 మధ్య కాలంలో పీక్స్‌కు చేరవచ్చు.
అక్టోబర్ 12న సూర్య గ్రహణం..అక్టోబర్ 12న తేదీన ఏర్పడనున్న సూర్య గ్రహణం ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో కన్పించనుంది. ఇండియాలో మాత్రం సూర్య గ్రహణం కన్పించదు.
ఖగోళ ఘటనల్ని నిలువరించడం మనిషికి సాధ్యమయ్యేది కానే కాదు. అయితే ఆ ఘటనల ముప్పును మాత్రం తగ్గించవచ్చు.