Ayyappa Deeksha: గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుచుకునే కేరళ రాష్ట్రం శబరిమలలో వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి దేశ వ్యాప్తంగా కోట్ల మంది భక్తులు అక్కడకు వెళుతుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచే ఎక్కువ మంది భక్తులు స్వామి అయ్యప్పను దర్శించుకుంటారు. అయితే ఇందులో చాలా మంది మాలధారణ చేసి వెళతారు. అయితే అయ్యప్ప మాలధారణకు సంబంధించి కొన్ని మాధ్యమాలు, గురు స్వాములు చెప్పిన విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాము.
Ayyappa Deeksha: గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుచుకునే కేరళ రాష్ట్రం శబరిమలలో వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి దేశ వ్యాప్తంగా కోట్ల మంది భక్తులు అక్కడకు వెళుతుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచే ఎక్కువ మంది భక్తులు స్వామి అయ్యప్పను దర్శించుకుంటారు. అయితే ఇందులో చాలా మంది మాలధారణ చేసి వెళతారు. అయితే అయ్యప్ప మాలధారణకు సంబంధించి కొన్ని మాధ్యమాలు, గురు స్వాములు చెప్పిన విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాము.
అయితే అయ్యప్ప మండల దీక్ష అంటే దాదాపు 40 రోజులు చేయాలనేది శాస్త్ర నియమం. కొంత మంది 41 రోజులు.. మరికొందరు 48 రోజులు అని చెబుతుంటారు. ఎవరైతే 48రోజు దీక్ష చేయకుండా శబరిమల అయ్యప్ప దర్శనానికి వస్తారో వారు సన్నిధానానికి సామాన్లు మోసుకొచ్చే గాడిదతో సమానమట.
ప్రతి ఒక్క అయ్యప్ప దీక్ష తీసుకునే భక్తుడు నలుపు వర్ణం దుస్తులు మాత్రమే ధరించాలి. కన్ని స్వామి అయిన గురు స్వామి అయిన నలుపు వస్త్రములు మాత్రమే ధరించాలనేది నియమం. ఎరుపు వస్త్రం యాత్ర సమయాల్లో మాత్రమే ధరించాలనేది శాస్త్ర నియమం. తప్ప మామూలుగా ధరించకూడదు, మనం సన్యాస ధర్మంలో లేము. బ్రహ్మచర్య దీక్షలో మాత్రమే ఈ దీక్ష చేపట్టాము కాబట్టి కాషాయ వస్త్రాలు అందరు వేయడానికి లేదు.
మనం చేసేది బ్రహ్మ చర్య దీక్ష మాత్రమే అనే సృహ స్వాముల్లో తీసుకురావాలి. సన్నాసి దీక్ష కాదు వనయాత్రలో మాత్రమే ఎరుపు వస్త్రం ధరించాలనేది నియమం. స్వాములకు ఏదైనా సేవ చేసే అవకాశం ఉంటుంది. అన్న ప్రసాదంలో దయచేసి అందరూ మసాలా దినుసులను నిషేధించాలి. సాత్విక ఆహారం ఉండే విధంగా చూసుకోవాలి.
ఆవు పాలు , ఆవు పెరుగు , ఆవు నెయ్యి , తేనె , చెరుకు రసం , వీటితోనే స్వామివారికి అభిషేకం జరిగేలా చూడాలి స్వామి.పవిత్రమైన అయ్యప్ప దీక్షను వ్యాపారంగా చేయకండి. పవిత్రమైన అయ్యప్ప పూజలను అంతే పవిత్రంగా ఆచరించాలి. అప్పులు చేసి మరీ పూజలు చేయడం నిషేధం. ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి పూజలు చేసుకోవడం ఉత్తమం.
ముఖ్యంగా , కన్ని స్వామి చాల నిగ్రహంతో నియమం పాటించాలి. గురు స్వాముల పర్యవేక్షణలో నియమ నిబంధనలు తెలుసుకోండి. పవిత్రమైన బంగారు పడిమెట్లు మండలం లేదా 48 రోజుల దీక్ష తర్వాతే ఎక్కాలనేది నియమం.పవిత్రమైన బంగారు 18మెట్లు ఎక్కడానికి బ్రహ్మచర్య కఠోర దీక్ష నియమాలు తప్పనిసరీ పాటించాలి , అయ్యప్ప స్వామిని దర్శించుకోడానికి మనం పడిన తపన & కృషి ఆ భగవంతుడికి కనపడాలి.
అందరూ అయ్యప్ప స్వామి దీక్ష నియమాలు తూచా తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా గురు స్వాములు మార్గ ధర్శకంగా వుంటూ తోటి స్వాములను క్రమ శిక్షణా నియమాలు పాటించే విధంగా వుంటూ మన తోటి సన్నిధానం స్వాములకు ఆదర్శంగా నిలవాలి. ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష పరులను చూసి మన తోటి వారు కూడా మాలలు ధరించే విధంగా ఆదర్శంగా వుందాము అంతే తప్ప నా కొద్దు ఇలాంటి మాల అనే విధంగా ప్రవర్తించరాదు.
అయ్యప్ప దీక్ష ద్వారా మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలు నలు దిక్కులా ప్రసరించేలా అయ్యప్ప దీక్షాపరులందరు కంకణ బద్ధులు కావాలి అని చిన్న ప్రయత్నం.ఎన్నిసార్లు శబరిమల వెళ్ళామన్నది ముఖ్యం కాదు అయ్యప్ప మాల పవిత్రతను పవిత్రంగా ఆచరిస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం.
మన ముందు తరాలకు మార్గ దర్శకంగా వుండాలి.మనం చేసే ఈ పవిత్రమైన దీక్ష పది మంది కి ఆదర్శం ఉండాలి. మనల్ని చూసి ఇంకో వంద మంది అయ్యప్ప దీక్ష వ్రతం ను తీసుకునేలా ఉండాలి. మనం ఎలాంటి పరిస్థితి లో నైనా మనం అయ్యప్ప స్వామి నియమాలను ఉల్లంగించకూడదన్నారు. మనల్ని చూసిన ప్రతి ఒక్కరి మది లో ఇలాంటి దీక్ష మనం ఎందుకు చేయకూడదు అనే భావన కలగాలి.మన దీక్ష నియమాలు చాలా ఆదర్శం గా అనుకువగా అందం గా కనిపించాలి.అయ్యప్ప స్వామి దీక్ష ను ఒకరు చూడాలి అని కాకుండా , నా కోసం , నా కుటుంభం కోసం , నాకు మంచి జరగడం కోసం , నేను ఈ దీక్షను తీసుకోవాలి అనుకున్న వాళ్ళే వేసుకోండి.