Daaku Maharaaj 4 days Collection: 4వ సారి 100 కోట్ల క్లబ్బులో బాలయ్య.. ‘డాకు మహారాజ్’తో సీనియర్ హీరో ఖాతాలో మరో రికార్డు..


Daaku Maharaaj 4 days Collection: తెలుగులో సీనియర్ టాప్ హీరోల్లో బాలకృష్ణ వరుస హిట్లతో మంచి ఊపు మీదున్నారు. అఖండ నుంచి అపజయం లేకుండా బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోతున్నారు. ఇక అఖండ మూవీతో తొలిసారి రూ. 100 కోట్ల గ్రాస్  క్లబ్బులో ప్రవేశించిన బాలయ్య.. ఆ తర్వాత కంటిన్యూ బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్ల గ్రాస్ కొల్లగొడుతూనే ఉన్నారు. తాజాగా ‘డాకు మహారాజ్’ రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించింది.

1 /7

Daaku Maharaaj 4 days Collection: నందమూరి బాలకృష్ణ  ప్రస్తుతం తన కెరీర్ లో అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఓవైపు వరుస సక్సెస్ లు.. అటు అన్ స్టాపబుల్ షోతో కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్నారు. హీరోగా వరుస సక్సెస్ లు... హోస్ట్ గా డబుల్ సక్సెస్ అందుకున్నారు.

2 /7

ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ మూవీతో తొలిసారి రూ. 100 కోట్ల క్లబ్బులో ప్రవేశించారు. ఆ తర్వాత ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాలతో ఎన్నో ఏళ్ల తర్వాత హాట్రిక్ సక్సెస్ బాలయ్య ఖాతాలో నమోదు అయింది.

3 /7

తాజాగా ఈ సంక్రాంతికి బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ గా ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 25.75 కోట్ల షేర్ రాబట్టింది.  వరల్డ్ వైడ్ గా రూ. 32.85 కోట్ల షేర్ తో పాటు రూ. 56 కోట్ల గ్రాస్ రాబట్టింది.

4 /7

తాజాగా నాలుగో రోజుతో ఈ సినిమా రూ. 105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు మూవీ వర్గాలు తెలిపాయి. దీంతో వరుసగా బాలయ్య ఖాతాలో మరో రూ. 100 కోట్ల గ్రాస్ మూవీగా ‘డాకు మహారాజ్’ రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో సీనియర్ హీరోల్లో చిరంజీవికి నాలుగు రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన చిత్రాలున్నాయి. తాజాగా ఆ రికార్డును బాలయ్య సమం చేశాడు. 

5 /7

ఇక బాలయ్య  60 ప్లస్ ఏజ్ తో వరుసగా నాలుగు హిట్స్ అందుకోవడంతో పాటు వరుసగా నాలుగు రూ. 100 కోట్ల గ్రాస్ అందుకున్నసీనియర్ స్టార్  భారత దేశంలో ఎవరు లేరు. ఒక రకంగా బాలయ్య వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు. 

6 /7

రజినీకాంత్, మోహన్ లాల్, చిరంజీవి, ముమ్ముట్టి వంటి హీరోలు 60 ప్లస్ ఏజ్ లో విజయాలు అందుకున్న వరుసగా మూడు,  నాలుగు హిట్ చిత్రాలు లేవు. కానీ బాలయ్య మాత్రం వరుసగా నాలుగు విజయాలతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసారు. దాదాపు రూ. 67 కోట్ల షేర్ (రూ. 10 కోట్ల గ్రాస్)తో మంచి ఊపుమీదుంది. ఈ వీకెండ్ వరకు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచే అవకాశాలున్నాయి.

7 /7

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘డాకు మహారాజ్’ చిత్రాన్ని ఇపుడు తమిళంలో రేపు (17-1-2024)న విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘డాకు మహారాజ్’ సినిమా తమిళ తంబీలను ఏ మేరకు అలరిస్తుందనేది చూడాలి. అంతేకాదు మరో వారంలో హిందీలో కూడా రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.