Barak Obama Divorce news: అమెరికా మాజీ అధ్యక్షుడు తన వివాహ బంధానికి ఫుల్ స్టాప్ చెప్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. గతంలో కూడా తన ఒబామాకు తనభార్యతో వచ్చిన మనస్పర్థలపై అప్పట్లో కౌన్సిలింగ్ తీసుకున్నట్లు తెలుస్తొంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సతీమణితో మిచెన్ తో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు విపరీతంగా వైరల్గా మారాయి. ఈ క్రమంలో దీనిపై ప్రస్తుతం జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
ఒబామాకు, మిచెల్ కు.. 1992 లో పెళ్లి జరిగింది. వీరిని మోస్ట్ పవర్ ఫుల్ కపుల్ గా భావిస్తుండే వారు. బారక్ ఒబామా ఎక్కడికి వెళ్లిన కూడా మిచెల్ ఆయన్ను వెన్నంటే ఉండేది. ఇక వీరికి ఇద్దరు కూతుళ్లు. వారు.. సాషా, మలియా.
బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా 2009 లో బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో నల్లజాతీయుడికి దక్కిన అరుదైన గౌరవంగా అందరు భావించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఒక్కసారిగా వీరిద్దరు డైవర్స్ తీసుకుంటున్నారనే వార్త తీవ్ర దుమారంగా మారాయి
కొన్నిరోజులుగా వీరిద్దరు దూరంగా ఉంటున్నారంట. అంతే కాకుండా.. ఇటీవల యూఎస్ మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమానికి.. మిచెల్ ఒబామా హాజరుకాలేదు. ఈ క్రమంలో..వదంతులకు మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒబామా హాజరవుతారని, అయితే మిచెల్ దూరంగా ఉంటారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో.. ఒబామా దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నాయనే వార్తలు మరోసారి ఊపందుకున్నాయి.
మరొవైపు గతంలొ కూడా.. వీరి విడాకులపై రూమర్స్ వచ్చాయి. 2000 సంవత్సరంలో.. వీరు విడాకులు తీసుకునేందుకు రెడీఅయిపోయారంట. కానీ అప్పట్లో కౌన్సిలింగ్ వల్ల.. తిరిగి ఒక్కటయ్యారంట. కానీ ఇప్పుడు మాత్రం వీరి మధ్య మనస్పర్థలు పీక్స్ కు చేరాయంట. ఈ నేపథ్యంలో వీరు డైవర్స్ కు రెడీ అయిపోయినట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి.