Balakrishna injuires: బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ భారీ విజయాన్ని సాధించింది. కానీ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్యకు తీవ్రమైన గాయాలు కావడం ఆందోళన కలిగించింది. అంటే కాక ఆపటినుంచి బాలకృష్ణ ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన డాకూ మహారాజ్ చిత్రం ఈనెల 10న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఇప్పటికే రూ.156 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, రూ.100 కోట్ల షేర్‌ను అందుకుంది. నైజాంలో మరిన్ని థియేటర్లు అందుబాటులో ఉంటే రూ.300 కోట్ల గ్రాస్ సాధించే అవకాశం ఉందని అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా విజయోత్సవ సమయంలో బాలయ్య తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. గతంలో ఆదిత్య 369 షూటింగ్‌లో నలుపు రంగు దుస్తులు ధరించిన రోజున ఆయన ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన తర్వాత బాలయ్య ఆదివారాల్లో నలుపు రంగు దుస్తులు ధరించడాన్ని పూర్తిగా మానుకున్నారంట.
ఆ సందర్భంలో నడుముకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. తాజాగా, డాకూ మహారాజ్ షూటింగ్ సమయంలో కూడా బాలయ్య స్వల్ప గాయాలు పాలయ్యారు. అయితే సినిమా విజయాన్ని చూసి ఈ గాయాలను లెక్కచేయకుండా ఆయన కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. ఇంకా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు బాలకృష్ణ
డాకూ మహారాజ్ తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద జరుగుతోంది. మహా కుంభమేళా నేపథ్యంలోని దృశ్యాలను చిత్రీకరించారు. పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయబోయే ఈ సినిమా, బాలయ్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
కాగా డాకూ మహారాజ్‌ను త్వరలోనే హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఆ భాషలో కూడా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు బాలకృష్ణ అభిమానులు.