Tvs Launches Ronin 2025: ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 భాగంగా మార్కెట్‌లోకి కొత్త కొత్త మోటర్ సైకిల్స్ విడుదలవుతున్నాయి. అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు ప్రత్యేకమైన డిజైన్స్‌తో కూడిన చాలా మోటర్ సైకిల్స్ ఇటీవలేయ లాంచ్ అయ్యాయి. అయితే ఈ ఎక్స్‌పో 2025లో TVS మోటార్స్ కంపెనీ కూడా కొత్త మోటర్ సైకిల్‌ని పరిచయం చేసింది. ఈ బైక్ ఎలాంటి పెట్రోల్ అవసరం లేకుండా CNGతో నడవబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
TVS మోటార్స్ ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 భాగంగా రోనిన్ మోటర్ సైకిల్(tvs ronin 2025 variant)ను అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదల చేసింది. ఇది గత మోడల్స్ కంపెనీ చాలా ప్రీమియం లుక్‌లో కనిపించబోతోంది. అయితే ఇప్పటికే ఈ మోటర్ సైకిల్‌కి సంబంధించిన వివరాలను కూడా కంపెనీ పేర్కొంది.
ఈ రోనిన్ మోటర్ సైకిల్ మొత్తం మూడు కలర్ ఆప్షన్స్‌లో విడుదల కాబోతోంది. ఇది నలుపు, పసుపుతో పాటు బంగారు కలర్స్ థీమ్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ మోటర్ సైకిల్ ప్రత్యేకమైన ఇంజన్‌తో విడుదల కానుంది.
ఈ మోటార్ సైకిల్ లుక్ చూడడానికి ఎంతో బాగుంటుంది. అంతేకాకుండా ప్రీమియం స్పోర్ట్స్ లుక్‌లో విడుదలైంది. TVS రోనిన్ హెడ్‌లైట్ పాప్‌కార్న్ బాక్స్ కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన LED ప్రొజెక్టర్ లైట్ సెటప్‌ను కూడా అందిస్తోంది.
ఇక దీని వేగాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేకమైన రౌండ్ స్పీడోమీటర్ కూడా లభిస్తోంది. అంతేకాకుండా దీని ఇంజన్ భాగంను కంపెనీ ప్రత్యేకంగా పూర్తిగా ABS మెటీరియల్‌తో అందుబాటులోకి తీసుకు రానున్నారు. అలాగే స్పెషల్ లోగో కూడా లభిస్తోంది.
TVS రోనిన్ మోటర్ సైకిల్ (tvs ronin 2025 variant) ఇతర వాటి కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా స్పెషల్ సీటింగ్ ఆప్షన్స్‌తో రానుంది. దీంతో పాటు రైడర్ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా మొదటి భాగంలో స్పెషల్ సీట్‌ను అమర్చినట్లు సమాచారం.