Vayve Eva Price: భారతదేశంలో ఆటో ఎక్స్‌పో 2025 కొనసాగుతోంది.ఈ ఎక్స్‌పోలో భాగంగా నేషనల్ ఆటో మొబైల్ కంపెనీలు కొత్త కొత్త కార్లను విడుదల చేస్తున్నాయి. ఇటీవలే చాలా బ్రాండ్‌లకు సంబంధించిన కార్లు లాంచ్ అయ్యాయి. అయితే ఎవా పేరుతో మార్కెట్‌లో కొత్త మొదటి సోలార్ ఎలక్ట్రిక్ కారు విడుదలైంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఎవా పేరుతో మొదటి సోలార్ ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్‌లో విడుదలైంది. ఈ కారు మొత్తం మూడు వేరియంట్స్‌లో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. 9 kWh, 12 kWhతో పాటు 18 kWh మూడు వేరియంట్స్‌తో విడుదలైనట్లు తెలుస్తోంది. అయితే దీని ధర రూ.3.25 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.
ప్రీ-బుకింగ్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ కార్లకు సంబంధించిన ప్రీ బుకింగ్ ప్రక్రియ సోమవారం నుంచే అందుబాటులోకి వచ్చింది. ఈ కార్లకు సంబంధించిన ధర రూ. 3.25 లక్షల నుంచి రూ. 5.99 లక్షల ఉండబోతున్నట్లు అధికారిక సైట్‌లో పేర్కొన్నారు.
ప్రీ బుకింగ్ ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్ చేసుకునేవారు తప్పకుండా రూ.5,000 నామమాత్రపు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ కార్లుకు సంబంధించి డెలివరీ 2026 సంవత్సరంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. మొదట దీనిని మొదటి 25,000 మంది కస్టమర్‌లకు ఈ కార్లను కంపెనీ అందించబోతోంది.
ఈ కార్లను కొనుగోలు చేసేవారికి బ్యాటరీ వారంటీతో పాటు ప్రత్యేకమైన మూడు సంవత్సరాల కాంప్లిమెంటరీ వెహికల్ కనెక్టివిటీ సదుపాయాన్ని కూడా కంపెనీ అందిస్తోంది. దీంతో పాటు ఈ కార్లకు సంబంధించిన గరిష్ట వేగం గంటకు 70 కిమీ మించి ఉండదని కూడా తెలిపింది.
ఇక ఈ కార్లు అద్భుతమైన టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 250 కిమీల ప్రాక్టికల్ మైలేజీని కూడా అందిచనుంది. అలాగే సోలార్ సిస్టమ్ ద్వారా ఛార్జ్ చేసేవారికి 3,000 కి.మీ వరకు ఛార్జింగ్ సెటప్‌ను అందిస్తోంది.