Bald Head Remedy: చాలామందికి 30 వయస్సుకు రాగానే జుట్టు విపరీతంగా రాలి బట్టతల సమస్య వస్తుంది. దీంతో చాలా మంది ఎక్కువ డబ్బులు వెచ్చించి మరీ చికిత్స చేయించుకుంటారు. అయినా కానీ, హెయిర్ ఫాల్ సమస్య ఆగదు. రోజూ ఒక్క జ్యూస్ తాగితే బట్టతల సమస్య రాకుండా ఉంటుంది.
ఉసిరికాయలు పోషకాలకు పవర్ హౌస్. ఇందులో విటమిన్ సీ ఉంటుంది. ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. ఉసిరికాయ బట్టతల రాకుండా నివారిస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఉసిరిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టిరియాల్ గుణాలు కలిగి ఉంటాయి. ఇది జుట్టును బలంగా మారుస్తుంది. చుండ్రు కూడా రాదు. ఇది తెల్లజుట్టు సమస్యను కూడా తగ్గిస్తుంది.
ఉసిరిరసం, కొబ్బరి నూనె కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గిపోతుంది. జుట్టుకు అప్లై చేసి పూర్తిగా ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఉసిరి రసం కుదుళ్ల ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది.
అయితే, ఉసిరి రసం తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం. జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి. ఉసిరి రసం ఖాళీ కడుపుతో తీసుకుంటే కూడా మంచిది. తలకు ఉసిరి రసం అప్లై చేయడంతోపాటు పరగడుపున తేనె వేసుకుని తీసుకోవాలి.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)