Warning Signs: మీ కాళ్లలో ఈ లక్షణాలు కన్పిస్తుంటే చాలా డేంజర్, ఈ వ్యాధులున్నట్టే

Warning Signs: శరీరంలో అంతర్గతంగా ఎదురయ్యే సమస్యలు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. అందుకే ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటిదే కాళ్లలో లేదా కాలి పాదాల్లో కన్పించే లక్షణాలు. ప్రమాదకరమైన వ్యాధికి సంకేతం కావచ్చు. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించగలిగితే ఎలాంటి సమస్య ఉండదు. 

Warning Signs: ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, గుండె వ్యాధులు, కిడ్నీ-లివర్ వ్యాధులకు కూడా కాళ్లలో లక్షణాలు కన్పించవచ్చు. అందుకే కాళ్లలో కన్పించే ఇలాంటి లక్షణాలను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. తక్షణం వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. 
 

1 /6

కాళ్ల వాపు కాళ్లు లేదా పాదాల్లో ఏ విధమైన గాయం లేకుండానే వాపు కన్పిస్తుంటుంది. ఇలా తరచూ కన్పిస్తే అలక్ష్యం చేయకూడదు. ఇది గుండె వ్యాధికి ప్రారంభ లక్షణం కావచ్చు. గుండె రక్తాన్ని సరిగ్గా సరఫరా చేయలేకపోవడం వల్ల ఈ సమస్య రావచ్చు. శరీరంలో నీరు చేరుతుంది. దాంతో కాళ్లలో వాపు ఉంటుంది. దీనిని వైద్యపరంగా ఎడీమా అంటారు.

2 /6

కాళ్లు తిమ్మిరి పట్టడం మీ కాళ్లలో తరచూ తిమ్మిరిగా ఉంటే తేలిగ్గా తీసుకోవద్దు. ఇది రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు. డయాబెటిస్ కూడా కారణం కావచ్చు. డయాబెటిస్ లేకుండా ఇలా ఉంటే మాత్రం గుండె వ్యాధి కావచ్చు

3 /6

గోర్లలో కన్పించే మార్పుు ఒకవేళ మీ కాలి గోర్ల దిగువన ఎర్రగా లేదా పర్పుల్ రంగులో చిన్న చిన్న గీతలు కన్పిస్తే బ్యాక్టీరియల్ ఎండూ కార్డైటిస్ అనే గుండె వ్యాధి కావచ్చు. ఇదొక సీరియస్ వ్యాధి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. 

4 /6

నడవడంలో ఇబ్బంది నడిచేటప్పుడు కాళ్లు నొప్పి వస్తుంటాయి. కాస్సేపు విశ్రాంతి తీసుకుంటే సెట్ అవుతుంది. దీనిని ఇంటర్ మిట్టెంట్ క్లాడికేషన్ అంటారు. కాలి కండరాల వరకు రక్తం సరిగ్గా సరఫరా కాకపోవడం వల్ల ఈ పరిస్థితి ఉంటుంది. వెంటనే వైద్యుని సంప్రదించాలి

5 /6

కాలి పుండు లేదా అల్సర్ మీ కాలికి ఎలాంటి గాయం లేకుండా పుండు లేదా అల్సర్ వచ్చి త్వరగా తగ్గకపోతే ఇది పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ కావచ్చు. ఈ వ్యాధి సోకితే రక్త నాళాలు సంకోచిస్తాయి. రక్త సరఫరా ఆటంకం కలుగుతుంది. తక్షణం చికిత్స చేయించాల్సి ఉంటుంది. గాంగ్రిన్ వంటి సమస్య వస్తే కాలు తొలగించాల్సిన పరిస్థితి 

6 /6

కాళ్లు చల్లబడటం, రంగు మారడం మీ కాళ్లు ఒకవేళ చల్లబడితే లేదా నీలం, వంకాయ రంగుల్లో మారితే కచ్చితంగా ఆందోళన చెందాల్సిన అంశమే. సయానోసిస్ లక్షణం ఇది. శరీరంలో ఆక్సిజన్ లోపం సంకేతం కావచ్చు. రక్త నాళాల్లో ఆటంకం కలిగినప్పుడు ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. కాళ్ల వరకూ రక్తం సరిగ్గా సరఫరా కాదు. ఇది హార్ట్ ఎటాక్, బ్లడ్ క్లాటింగ్ వంటి సమస్యలకు దారితీస్తుంది.