Manchu Lakshmi Husband: తెలుగు చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి తన వ్యక్తిగత జీవితం గురించి తాజాగా స్పందించింది. భర్త ఆండీ శ్రీనివాసన్‌తో ఎందుకు ఎక్కువ సమయం గడపడం లేదన్న ప్రశ్నకు ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చింది.
తెలుగు చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి తన వ్యక్తిగత జీవితం గురించి తాజాగా స్పందించింది. ఆమె భర్త శ్రీనివాసన్‌తో ఎందుకు ఎక్కువ సమయం గడపడం లేదన్న ప్రశ్నకు ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చింది.
మంచు లక్ష్మి తన కెరీర్‌పై దృష్టి పెట్టి ముందుకు సాగుతూనే, కుటుంబ జీవితానికీ సమాన ప్రాధాన్యత ఇస్తుందని తెలిపింది. తాను తన భర్తతో ఎంతో అన్యోన్యంగా ఉంటానని, కానీ వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుకుంటూ జీవించడం ఇష్టమని చెప్పింది.
ఆమె మాట్లాడుతూ, "మేము న్యూక్లియర్ ఫ్యామిలీగా ఉండటాన్ని ఎక్కువ ఇష్టపడతాం. మా వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం కోసం ఇలా జీవిస్తున్నాం. అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోము ఎవరికి ఎలా ఇష్టమో అలా జీవిస్తాము. ముఖ్యంగా ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోవడం అవసరం లేదనుకుంటాం" అని చెప్పింది.
కోవిడ్ సమయంలో తన భర్తతో ఎక్కువ సమయం గడిపినప్పటికీ, ప్రస్తుతం తన కెరీర్ కారణంగా ఎక్కువగా వేరుగా ఉంటున్నామని తెలిపింది. తన కూతురిని కూడా భర్త దగ్గరకు పంపిందని, వారం రోజులకోసారి కలిసి సమయం గడుపుతామని వివరించింది.
ఆండీ శ్రీనివాసన్ చెన్నై వాసి, ఐటీ రంగంలో వృత్తి జీవితం కొనసాగిస్తున్నారని తెలిపింది. 2006లో వీరి వివాహం జరిగింది. వీరి కూతురు విద్యా నిర్వాణ మంచు ప్రస్తుతం చదువుకుంటోంది. ప్రస్తుతం మంచు లక్ష్మి 'ఆదిపర్వం' సినిమాలో నటిస్తోంది. తన కెరీర్‌ను మరింత మెరుగుపరచుకోవాలన్న ఉద్దేశ్యంతో ముంబైలో ఎక్కువగా ఉంటోందని తెలిపింది.