Sreeleela: ఆ విషయంలో మాత్రం శ్రీలీలకే మొదటి స్థానం..!

Sreeleela Photos: శ్రీ లీల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వరస సినిమా అవకాశాలు అందుకుంటూ.. సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు సైతం అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి.

1 /5

పెళ్లి సందడి సినిమాతో పరిచయమైన శ్రీ లీల.. ఆ తరువాత వరుస పెట్టి అవకాశాలు అందుకుంది. ఒకేసారి 9 సినిమాల పైన సైన్ పెట్టి సెన్సేషనల్ హీరోయిన్ గా మారింది.

2 /5

అయితే ఈ హీరోయిన్ కి కేవలం కొన్ని సినిమాలు మాత్రమే విజయాన్ని తెచ్చిపెట్టాయి. కాగా బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరి చిత్రం శ్రీలీలకి.. నటిగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. 

3 /5

ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగులోనే కాకుండా తమిళం, హిందీలో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా హిందీలో త్వరలోనే ఆషికి 3 సినిమాలో కనిపించనుంది.

4 /5

సినిమాల విషయం పక్కన పెరిగితే ప్రస్తుతం శ్రీ లీల తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ కి దాదాపు 11 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

5 /5

అయితే వరస పోస్టులు షేర్ చేస్తూ.. గ్లామర్ పరంగా కూడా.. డిఫరెన్స్ స్టైల్ డ్రస్సులు వేసుకొని.. ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చెయ్యడంలో.. తెలుగు హీరోయిన్స్ లో ముందంజలో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో స్టైలిష్ ఫోటోలు షేర్ చేయడంలో ఈమె ప్రతి స్థానంలో ఉంది అంటున్నారు ఆమె అభిమానులు.