Sunil Gavaskar Gundappa Viswanath Relationship: దిగ్గజ ఆటగాడు, టీమిండియా లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓపెనర్‌గా భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసి.. సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. 1983 వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లో సునీల్ గవాస్కర్ సభ్యుడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
1983 వరల్డ్ కప్ టీమ్‌కు ముందు సునీల్ గవాస్కర్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని అప్పట్లో అందరూ అనుకున్నారు. అయితే సెలక్టర్లు కపిల్ దేవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దీంతో వీరిద్దరి మధ్య కొంతకాలం కోల్డ్ వార్ నడిచినా.. వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి కపిల్, గవాస్కర్ టీమిండియా కోసం ఆడారు.
గవాస్కర్ గురించి క్రికెట్ అభిమానులకు తెలియని ఓ ఆసక్తికర విషయం ఉంది. ఆయన సోదరి కవిత భారత జట్టు క్రికెట్ ప్లేయర్‌ను వివాహం చేసుకున్నారు.
గుండప్ప విశ్వనాథ్ బ్యాట్స్‌మెన్‌గా టీమిండియాకు చాలా ఏళ్లు సేవలు అందించారు. కర్ణాటకకు చెందిన విశ్వనాథ్ కుటుంబంతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటున్నారు.
గవాస్కర్‌కు ఇద్దరు సోదరీమణులు కవిత, నూతన్ ఉన్నారు. బ్యాట్స్‌మెన్ విశ్వనాథ్‌ను కవితం వివాహం చేసుకున్నారు.
గవాస్కర్, విశ్వనాథ్ ఇద్దరు 1949లో జన్మించారు. ఇద్దరు కూడా 5 అడుగుల 5 అంగుళాల ఎత్తు ఉన్నారు. గవాస్కర్ 125 టెస్టు మ్యాచ్‌లు ఆడి 10,122 పరుగులు చేయగా.. విశ్వనాథ్ 91 టెస్టుల్లో 6,080 రన్స్ చేశాడు.