Fridge Usage Tips: రిఫ్రిజిరేటర్ లేని ఇళ్లు ఉండదంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఇదొక నిత్యావసరమైంది. నీళ్లు చల్లగా ఉండేందుకు, ఆహార పదార్ధాలు పాడవకుండా ఉండేందుకు ఫ్రిజ్ వినియోగం తప్పనిసరి అవుతోంది. అయితే ఒక్కోసారి వినియోగం సరిగ్గా లేకపోతే ఫ్రిజ్‌లో ఉంచినా సరే ఆహార పదార్ధాలు పాడయిపోతుంటాయి.
Fridge Usage Tips: మీ ఇంట్లో ఫ్రిజ్‌లో ఆహార పదార్ధాలు దీర్ఘకాలం తాజాగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.
టెంపరేచర్ ఎంత ఉండాలి ఫ్రిజ్‌లో టెంపరేచర్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఫ్రిజ్‌లో టెంపరేచర్ 1-4 డిగ్రీల మద్యలో ఉంటే మంచిది. ఫ్రీజర్ అయితే మైనస్ 18 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అప్పుడే బ్యాక్టీరియా ప్రభావం తగ్గుతుంది.
ఎయిర్‌టైట్ కంటైనర్ వినియోగం మీ ఫుడ్ ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఎయిర్‌టైట్ కంటైనర్‌లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్‌గా ఉంచితే బ్యాక్టీరియా, తేమ త్వరగా ఎఫెక్ట్ అవుతాయి. దాంతో త్వరగా పాడవుతాయి. ప్రత్యేకించి పాలు, పన్నీర్, కట్ చేసిన ఫ్రూట్స్ , కూరగాయలు పూర్తిగా క్లోజ్ చేసి ఉంచాలి
ఆహారం ఎలా స్టోర్ చేయాలి ఫ్రిజ్‌లో వండిన, వండని ఆహారాన్ని వేర్వేరు విధాలుగా స్టోర్ చేయాల్సి ఉంటుంది. పచ్చి మాంసం, చేపలు, గుడ్లను దిగువ సెక్షన్లో ఉంచాలి. లేకపోతే వాటి ద్వారా జారే నీరు దిగువన ఉన్న పదార్ధాలపై పడుతుంది. వండిన ఆహారాన్నిపై భాగంలో ఉంచాలి.
పండ్లు, కూరగాయలు ఎలా ఉంచాలి అన్ని రకాల పండ్లు, కూరగాయల్ని ఒకే విధంగా ఎప్పుడూ స్టోర్ చేయరు. ఆకుకూరల్ని ఎప్పుడూ పేపర్‌తో చుట్టి ప్లాస్టిక్ కవర్లో ఉంచాలి. అదే ఆపిల్, అరటి, టొమాటోలను అసలు ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఇవి ఫ్రిజ్‌లో ఉంచితే త్వరగా పాడయిపోతాయి
ఫ్రిజ్ క్లీన్‌గా ఉండాలి ఫ్రిజ్ ప్రతి 10-15 రోజులకు క్లీన్ చేస్తుండాలి. ఏవైనా ఆహార పదార్ధాలు పాడయితే వెంటనే తొలగించాలి. గోరు వెచ్చని నీరు, బేకింగ్ సోడాతో లోపలి భాగం క్లీన్ చేయాలి