Post Office Schemes: పోస్టాఫీసు సేవింగ్ పథకాలు అత్యంత సురక్షితమైనవే కాకుండా లాభదాయకమైనవి. పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి మరో గుడ్ న్యూస్. ఏకంగా 50 లక్షలు సంపాదించే అవకాశం ఇది. ఈ సేవింగ్ పధకం వివరాలు ఏంటనేది పరిశీలిద్దాం..
ఎలా అప్లై చేయాలి లైఫ్ ఇన్సూరెన్స్ వెబ్‌సైట్ https://pli.indiapost.gov.in క్లిక్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది.
ఎవరికి ప్రయోజనం ఈ పాలసీ ప్రయోజనం 80 ఏళ్ల వయస్సులో లభిస్తుంది. ఈ పథకం ఎస్యూర్డ్ ఎమౌంట్ ఇన్సూరెన్స్ అప్పుడే ఉంటుంది.
రుణ సౌకర్యం ఇలా ఇందులో ఒకవేళ పాలసీదారుడు వరుసగా నాలుగేళ్ల వరకూ పాలసీ ఉంచితే..అతడికి రుణ సౌకర్యం కూడా లభిస్తుంది. పాలసీ క్లోజ్ చేయాలనకుంటే 3 ఏళ్ల తరువాతే చేయాలి. 5 ఏళ్లలోపు క్లోజ్ చేస్తే బోనస్ లభించదు.
50 లక్షలు సంపాదించే అవకాశం ఈ పధకంలో పాలసీదారుడికి 50 లక్షల వరకూ సౌకర్యం లభిస్తుంది. ఇందులో 19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకూ వయస్సున్నవారు పెట్చుబడి పెట్టవచ్చు. ఇందులో బోనస్ కూడా లభిస్తుంది. దాంతోపాటు కనీస 20 వేల రూపాయలు, గరిష్టంగా 50 లక్షల రూపాయలు ప్రయోజనం లభిస్తుంది. ఈ పథకం మధ్యలో పాలసీదారుడు మరణిస్తే నామినీకు డబ్బులు అందుతాయి.
ఈ పథకం పేరేంటి ఈ పథకం పేరు పోస్టల్ జీవన్ బీమా. ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు అవుతాయి. ఇది ప్రభుత్వం అందిస్తున్న ఇన్సూరెన్స్ పథకం. ఇందులో ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎవరు అర్హులనే వివరాలు చూద్దాం.