Game Changer: కన్ఫ్యూజన్ వీడని గేమ్ ఛేంజర్.. నష్టం తప్పదా..?

Game Changer Ticket Prize: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్థాయి ఇమేజ్ను అందుకున్నారు రామ్ చరణ్. ఇప్పుడు ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.  జనవరి 10వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు చిత్ర బృందం.

1 /5

రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగంగా చేపట్టారు.. అమెరికాలోని డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతేకాదు రామ్ చరణ్ తదుపరి సినిమా చేసే డైరెక్టర్ బుచ్చిబాబు సనా కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. ఇక అలాగే ఆంధ్రాలో కూడా వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని, ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డీసీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని సమాచారం.   

2 /5

ఇకపోతే ప్రమోషన్స్ అయితే జోరుగా చేపట్టారు కానీ పెట్టిన బడ్జెట్ వెనక్కి వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నిన్న జరిగిన మీటింగ్ ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినీ పెద్దలంతా నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.   

3 /5

ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సెలబ్రిటీలు ముఖ్యమంత్రిని కలిసి తమ ప్రతిపాదనలను తెలిపారు.  అన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కండిషన్లు కూడా పెట్టారు.  ఇక వాటికి కూడా వీరు అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ బెనిఫిట్ షోలను మాత్రం పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని చెప్పినా.. సినిమాను థియేటర్లలో రన్ చేసుకోండి. కథ బాగుంటే ఆదాయం పెరుగుతుందని, బెనిఫిట్ షో లో వల్ల ప్రాణ నష్టం మళ్లీ జరిగితే ప్రజలు ఊరుకోరని ముఖ్యమంత్రి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

4 /5

ఇక అంతే కాదు టికెట్ ధరల పెంపుపై కూడా నిరాకరించినట్లు సమాచారం. ఏది ఏమైనా బెనిఫిట్ షో నిర్మాతలకు ఎంత లాభాన్ని అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పుష్ప 2 బెనిఫిట్ కారణంగా ఒక మనిషి ప్రాణం కోల్పోగా..  ఒక బాలుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో సీఎం బెనిఫిట్ షోలను రద్దు చేశారు.  అయితే ఇప్పుడు ఈ దెబ్బ రాంచరణ్ గేమ్ ఛేంజర్  పైన పడబోతోంది   

5 /5

బెనిఫిట్ షో మళ్లీ పెట్టవచ్చు అని సీఎం చెబుతారని ఆశలు పెట్టుకున్నారు కానీ ఆయన ఆశలకు కళ్లెం వేశారు.  దీంతో ఈ నష్టం నిర్మాతల పై భారీగా పడే అవకాశం కనిపిస్తోంది.  ఏది ఏమైనా సినిమా బాగుందని చెబుతున్నా..  బెనిఫిట్ షో లేకపోవడం వల్ల కలెక్షన్లు అనుకున్నంత స్థాయిలో రావని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా బన్నీ దెబ్బ ఇప్పుడు రాంచరణ్ పై పడబోతుందని సమాచారం.