Aadhar: ఆధార్‌ కార్డుదారులకు బంపర్‌ న్యూస్‌.. మరోసారి గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..?

Aadhar Update: ఆధార్‌ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బంపర్‌ న్యూస్ ప్రకటించింది. మరోసారి ఆధార్‌ కార్డు అప్డేట్‌ చేసుకునేందుకు గడువు పెంచింది. అయితే, పదేళ్లు దాటిన తర్వాత కూడా ఆధార్‌ కార్డు అప్డేట్‌ చేసుకోకపోతే అది పనిచేయదు. ఈ నేపథ్యంలో ఆధార్‌ అప్డేట్‌కు కేంద్రం గడువు పెంచింది.
 

1 /5

మన దేశంలో ఆధార్‌ కార్డు ఎంతో అవసరం. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ గుర్తింపు కార్డు ప్రతి లావాదేవీలకు అవసరం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆధార్‌ కార్డు కలిగి ఉన్నారు.  

2 /5

ఐదేళ్లలోపు ఉన్న పిల్లలకు బాల ఆధార్‌ లేదా బ్లూ ఆధార్‌ జారీ చేస్తారు. అయితే, ఏ సంక్షేమ పథకం పొందాలన్నా ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఇటీవలె కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ కార్డు విషయంపై కీలక ఆదేశాలు జారీ చేసింది.  

3 /5

పదేళ్లు పాతబడిన ఆధార్‌ కార్డులు అప్డేట్‌ చేసుకోకపోతే అవి పనిచేయవని గడువు ఇచ్చింది. డిసెంబర్‌ 14 చివరి తేదీ వరకు అప్డేట్‌ చేసుకోవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో సర్వర్‌ డౌన్‌ మరికొన్ని సమస్యల కారణంగా గడువు పెంచింది.  

4 /5

ఆధార్‌ కార్డు అప్డేట్‌ చేసుకోవడానికి మై ఆధార్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.ఆధార్ కార్డు అప్డేట్‌ చేసుకోవాలంటే మీ వద్ద రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ ఉండాలి.  

5 /5

అంతేకాదు రేషన్‌ కార్డు, ఓటర్‌, రెసిడెన్స్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి. మీ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అన్ని పూర్తి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో ఆధార్‌ అప్డేట్‌ అయిపోతుంది.