Fake Ration Cards Removed: ఆ రేషన్ కార్డుదారులకు బిగ్ బ్యాడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వారి రేషన్ కార్డులను కట్ చేసింది. మొన్నటి వరకు కేవైపీ ప్రక్రియను పూర్తి చేసిన సంగతి తెలిసిందే.. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఫేక్ రేషన్ కార్డులను కట్ చేసింది.
కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 5 కోట్లకు పైగా రేషన్ కార్డులను కట్ చేసింది. ఈ కేవైసీ 63 శాతం వెరిఫికేషన్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫేక్ రేషన్ కార్డులను కట్ చేసిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డుల డిజిటలైజేషన్ పూర్తి అయిన తర్వాత ఈ ఫేక్ రేషన్ కార్డులను రద్దు చేసింది.
వన్ నేషన్, వన్ రేషన్ కార్డు విధానం అమలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు రేషన్ బియ్యం సరఫరాను కూడా ట్రాక్ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది.
ఇదిలా ఉండగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఎన్నో రోజులుగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఇటీవలె రేషన్ కార్డులో తమ కుటుంబ సభ్యులను కూడా చేర్చుకునే సదుపాయం కల్పించింది.
ఇక రేషన్ కార్డులు లేనివారికి కొత్త రేషన్ కార్డులను అతిత్వరలోనే మంజూరు చేస్తామని కూడా చెప్పింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఒక్కో పథకం అమలు చేస్తూ ఉంది. ప్రస్తుతం 'కులగణన' డోర్ టూ డోర్ సర్వీస్ కూడా చేస్తోంది.