కాకరకాయ అంటేనే చేదు గుర్తొస్తుంది. అందుకు తగ్గట్టే ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. కాకరకాయలో ఔషద గుణాలు చాలా ఎక్కువ. మధుమేహం, లివర్ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు దూరం చేస్తుంది. కానీ కాకరకాయతో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. కొంతమంది కాకరకాయకు దూరంగా ఉండాలి.
Bitter Gourd Side Effects: కాకరకాయ అంటేనే చేదు గుర్తొస్తుంది. అందుకు తగ్గట్టే ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. కాకరకాయలో ఔషద గుణాలు చాలా ఎక్కువ. మధుమేహం, లివర్ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు దూరం చేస్తుంది. కానీ కాకరకాయతో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. కొంతమంది కాకరకాయకు దూరంగా ఉండాలి.
సర్జరీ రోగులు కాకరకాయలో రక్తం గడ్డకట్టే ప్రక్రయను మందగించేలా చేసే గుణాలుంటాయి. అందుకే సర్జరీ చేయించిన రోగులకు కాకరకాయ పెట్టకూడదు. లేకపోతే రక్తం గడ్డకట్టకుండా పోతుంటుంది.
గ్లూకోజ్ 6 ఫాస్పేట్ డీ హైడ్రేషన్ లోపం ఇదొక వంశపారంపర్య వ్యాధి. ఇందులో శరీరంలోని రెడ్ బ్లడ్ సెల్స్ బలహీనమౌతుంటాయి. కాకరకాయ తినడం వల్ల వీరిలో రక్తహీనత సమస్య ఉత్పన్నం కావచ్చు.
లో షుగర్ వ్యాధిగ్రస్థులు కాకరకాయలో ఉండే పోషకాలు రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తాయి. అందుకే డయాబెటిస్ నియంత్రణలో కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుంది అయితే లో షుగర్‌తో బాధపడేవారు కాకరకాయకు దూరంగా ఉండాలి. లేకపోతే షుగర్ లెవెల్స్ మరింత తగ్గిపోతాయి.
పాలిచ్చే తల్లులు కాకరకాయలో ఉండే కొన్ని రకాల పోషకాలు తల్లిపాలలో కలిసిపోయే అవకాశమంది. ఇవి శిశువు ఆరోగ్యానికి హాని కల్గిస్తాయి. అందుకే పాలిచ్చే తల్లులు కాకరకాయ తినకూడదు.
గర్భిణీ మహిళలు కాకరకాయలో ఉండే కొన్ని గుణాలు గర్భాశయాన్ని సంకోచించేలా చేస్తుంది. ఫలితంగా ప్రీ మెచ్యూర్ డెలివరీ లేదా గర్భస్రావం ముప్పు ఉండవచ్చు. అందుకే గర్భిణీ మహిళలు కాకరకాయ తీసుకోకూడదు.