Brahmanandam Reveals Shocking Story Oh Behind Not Acting In Movies: వందల సినిమాలు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి హాస్య బ్రహ్మగా గుర్తింపు పొందిన నటుడు బ్రహ్మానందం కొన్నేళ్లుగా సినిమాలకు దూరమయ్యారు. సినిమాలు చేయకుండా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే సినిమాలు చేయకపోవడానికి కారణాన్ని బ్రహ్మనందం వివరించారు. తాను సినిమాలు ఆపేయడానికి చెప్పిన కారణం సంచలనం రేపారు.
బాలనటుడిగా నటనా ప్రస్థానం మొదలుపెట్టి వేలాది సినిమాలు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు బ్రహ్మానందం. తన సినిమాలతో గిన్నీస్ బుక్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టాడు. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్న బ్రహ్మానందం అకస్మాత్తుగా సినిమాలకు దూరమయ్యారు. కొన్నేళ్లుగా సినిమాల్లో బ్రహ్మానందం కనిపించడం లేదు.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మెల్లగా ప్రారంభించిన బ్రహ్మానందం ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. హాస్యం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నారు.
తాజాగా తన కుమారుడు గౌతమ్‌తో కలిసి 'బ్రహ్మానందం' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మానందం కొన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు.
ఈ క్రమంలోనే కొన్నేళ్లుగా సినిమాలకు దూరం ఉండడానికి గల కారణాలను బ్రహ్మానందం వివరించాడు. తాను సినిమాలు చేయకపోవడానికి కారణం తోటి నటీనటులే కారణమని సంచలన ప్రకటన చేశాడు.
'బాగానే చేస్తున్నాడు కానీ ఇంతకుముందులా వచ్చినంత నవ్వు ప్రస్తుతం రావడం లేదని కొంత మంది హాస్య నటీనటులు చెప్పారు' అని బ్రహ్మానందం వివరించారు.
మరో విషయం చెబుతూ 'మన వయసును దృష్టిలో ఉంచుకోవాలి. ఇంతకుముందు చేసినంత ఉత్సాహంగా నేను చేయడం లేదనే విషయం కూడా నాకు తెలుసు. ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు ఉంచుకోవాలంటే కొన్ని తగ్గించుకోవాలి. అందుకే సినిమాల ఎంపిక తగ్గించా అంతే!. కానీ నాకు అవకాశాలు రాక కాదు.. చేయలేక కాదు' అని బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు చేశారు.
'30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే కామెంట్స్ మెడలో బోర్డులు వేసుకుని తిరగడానికి మాత్రమే పనికివస్తాయి. ఎప్పటికప్పుడు మనల్ని మనం పునరాలోచించుకుంటూ ఉండాలి. స్వీయ విమర్శ చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. అందుకే సినిమాలు తగ్గించా' అని బ్రహ్మానందం వెల్లడించారు.