BSNL: అబ్బో.. ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌పై ఓ లుక్కేశారా? రూ.2400 లోపే 13 నెలల వ్యాలిడిటీ 790 జీబీ..

BSNL 13 Months Plan: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) ప్రభుత్వం రంగ టెలికాం కంపెనీ. ఇది ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తూ కళ్లు చెదిరే రీఛార్జీ ప్యాక్‌లను అతి తక్కువ ధరలోనే పరిచయం చేస్తోంది. 30 రోజుల ప్లాన్‌ నుంచి 395 రోజుల ప్లాన్లను వినియోగదారులకు బడ్జెట్‌ ఫ్రెండ్లీ ప్యాక్‌లను అందిస్తోంది. 
 

1 /5

మీరు తరచూ రీఛార్జీ చేసుకునే అవసరం లేకుండా అతి తక్కువ ధరలోనే రీఛార్జీ ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. దీంతో కస్టమర్లు చాలామంది బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈరోజు మరో కొత్త రీఛార్జీ ప్యాక్‌ పూర్తి వివరాలు తెలుసుకుందాం..  

2 /5

బీఎస్ఎన్‌ఎల్‌ 395 రోజుల ప్లాన్‌.. రూ.2399 బీఎస్ఎన్ఎల్‌ ప్లాన్‌ వ్యాలిడిటీ 395 రోజులు వర్తిస్తుంది. ఇదే ధరలో ఏయిర్‌టెల్‌ 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. ఏయిర్‌టెల్‌, వీఐ, జియో అతి తక్కువ ధరలోనే ఎక్కువ రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది.

3 /5

అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ ఏ నెట్‌వర్క్‌ అయిన చేసుకోవచ్చు అదనపు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. ఇందులో 2జీబీ డేటా హైస్పీడ్‌ పొందుతారు. 790 జీబీ డేటా ప్లాన్‌ వ్యాలిడిటీ సమయంలో పొందుతారు. లిమిట్‌ పూర్తయిన తర్వాత 40 కేబీపీఎస్‌ పొందుతారు.  

4 /5

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.1999 ప్లాన్‌.. మరికాస్త తక్కువ ధరలో రీఛార్జీ చేసుకోవాలంటే రూ.1999 అందుబాటులో ఉంది. ఈ ప్యాక్‌ వ్యాలిడిటీ 365 రోజులు వర్తిస్తుంది. ఇందులో మీరు 600 జీబీ డేటా పొందుతారు. 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యం ఉంటుంది.

5 /5

బీఎస్‌ఎన్‌ఎల్‌ లాంగ్‌ టర్మ్‌ వ్యాలిడిటీ ప్లాన్‌ వల్ల తక్కువ ధరకే ఎక్కువ వ్యాలిడిటీ లభిస్తుంది. బడ్జెట్‌ ఫ్రెండ్లీలో అందుబాటులో ఉంది. ఇటీవలె బీఎస్ఎన్ఎల్‌ వాయిస్‌ ఓన్లీ ప్లాన్స్‌ కూడా తీసుకువచ్చింది. ఇది ఫీచర్ ఫోన్స్‌ ఉపయోగించే కస్టమర్లు అదనంగా ఖర్చు చేయకుండా కేవలం వాయిస్‌ కాల్స్‌ మాత్రం చేసుకోవచ్చు.