Sairat Heroine Rinku Rajguru Likely To Marries MP Son: సినీ పరిశ్రమలో మరో వివాహం జరగనుందని సమాచారం. ప్రస్తుతం శుభ ముహూర్తాలు ఉండడంతో ఓ హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని తెలుస్తోంది. ఒక్క సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ ఇప్పుడు బీజేపీ ఎంపీ కుమారుడితో ప్రేమాయణం సాగిస్తోందని చర్చ జరుగుతోంది. ఈ చర్చకు వీరి ఫొటో ఒకటి బలం చేకూరుతోంది.
మరాఠా సినీ పరిశ్రమలో సైరట్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత దాదాపుగా అన్ని భాషల ప్రేక్షకులు కూడా చూసేశారు. ఈ సినిమా ద్వారా రింకు రాజ్‌గురు హీరోయిన్‌గా పరిచయమైంది. అనంతరం పలు చిత్రాల్లో నటించింది.
హీరోయిన్ రింకూ రాజ్‌గురు వివాహంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీ ఎంపీ తనయుడితో ప్రేమాయణం సాగిస్తోందని.. త్వరలోనే పెళ్లి కూడా జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఎంపీ తనయుడితో కలిసి రింకూ ఆలయాన్ని సందర్శించడంతో ఆ వార్తలు నిజమేనని తేలుతోంది.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు ధనంజయ్ మహాదిక్ కుమారుడు కృష్ణరాజ్ మహాధిక్‌తో కలిసి రింకూ కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించింది. అక్కడ వీరిద్దరూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ ఫొటోతో రింకూ, కృష్ణరాజ్ పెళ్లి ఖాయమని ప్రేక్షకులు, ఆమె అభిమానులు భావిస్తున్నారు. కొన్నాళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని మరాఠా సినీ పరిశ్రమతోపాటు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
రింకు, కృష్ణరాజ్ ఫొటోపై హీరోయిన్ కుటుంబం మౌనం వీడింది. వారిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదని ఆమె కుటుంబసభ్యులు స్పష్టం చేశారు. ఆలయానికి వెళ్లినప్పుడు దర్శన సమయంలో అక్కడ కలిశారని ఆ కుటుంబం వివరించింది.
ఇక రింకుతో దిగిన ఫొటోపై కృష్ణరాజ్ మహాదిక్ కూడా స్పందించాడు. 'ఆ ఫొటోను చూసి తప్పు పట్టకండి. రింకూ నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. ఆమె ఒక కార్యక్రమం కోసం కొల్హాపూర్ వచ్చింది. ఆ సందర్భంలో నేను, రింకూ కలిశాము. అంతే!' అని కృష్ణరాజ్ వివరణ ఇచ్చాడు.
ఇరుపక్షాల వివరణ విన్న తర్వాత కూడా అది వాస్తవం కాదని నెటిజనలు చెబుతున్నారు. త్వరలోనే రింకూ సింగ్‌తో కృష్ణరాజ్ వివాహం జరుగుతుందని కామెంట్ చేస్తున్నారు.