Shani - Ravi Transit: 30 యేళ్ల తర్వాత మహా శివ రాత్రి రోజున మహాద్భుతం.. డబ్బు విషయంలో ఈ రాశుల వారు బీ కేర్ ఫుల్..

Shani - Ravi Transit: శనీశ్వరుడు నవ గ్రహాల్లో అత్యంత పవర్ ఫుల్.  ప్రస్తుతం శని దేవుడు త్రికోణ రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శని ఒక రాశిలో దాదాపు 2 1/2 యేళ్లు సంచరించడం వలన ఈయన్ని మంద గమనుడు అని పిలుస్తారు.  ఇక ఫిబ్రవరి 26 మహా శివరాత్రి తర్వాత శని కుంభ రాశిలో రవి ప్రవేశించడం వలన  అస్తగతం అవుతున్నాడు.

1 /6

Shani - Ravi Transit:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్య దేవుడ, శని దేవుడు తండ్రీ కొడుకులు అయినప్పటికీ, వారు నిత్య శత్రువులు. అందువల్ల, శని, సూర్యుడు కలిసి ప్రయాణించే కాలంలో శనిదేవుడు సూర్య దేవుడి ప్రభావం వలన అస్తమిస్తాడు  కాబట్టి, దాని ప్రభావం మేషం నుండి మీనం వరకు ఉన్న అన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశుల వ్యక్తుల జీవితంలో వివిధ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆర్థిక నష్టం, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు  ఎక్కువగా ఉండబోతున్నాయి.

2 /6

మిథున రాశి: శనీశ్వరుడు మిథున రాశి 9వ ఇంట్లో రవితో కలిసి అస్తంగతం అవతున్నాడు.  కాబట్టి, ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా మెలగాలి. మీరు ఏమి చేసినా.. మీకు అడ్డంకులు, వైఫల్యాలు ఎదురవుతాయి. ఒత్తిడితో కూడిన జీవితాన్ని అనుభవిస్తారు. ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు వాహనం నడుపుతున్నప్పుడు అప్రమత్తత అవసరం. ఖర్చులను నియంత్రించుకోవాలి. లేకపోతే, మీరు ఆర్థిక సమస్యలను ఫేస్ చేయవచ్చు. మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకుండా ఉండడం ఉత్తమం. వీరు శని దేవుడికి సంబంధించిన స్తోత్రాలతో పాటు శనివార నియమాలు పాటిస్తే శని దేవుడి అశుభ దృష్టి నుంచి బయట పడతారు.

3 /6

సింహరాశి: శనిదేవుడు.. సింహరాశికి  7వ ఇంట్లో కుంభరాశిలో రవితో కలిసి ఉంటున్నాడు. దీని కారణంగా, ఈ రాశి వారు తమ వైవాహిక జీవితంలో అనే ఒడిదుడుకులను  ఎదుర్కోవలసి ఉంటుంది. ఆఫీసులో పనిచేసే వారు చాలా సమస్యలను ఫేస్ చేస్తారు.  మీరు కార్యాలయంలోని సీనియర్ అధికారులతో పాటు తోటి ఉద్యోగులతో అభిప్రాయ భేదాలను ఎదుర్కుంటారు.  ఈ సమయంలో మీరు డబ్బు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

4 /6

తులారాశి: తులా రాశి 5వ ఇంట్లో శని అస్తమించడం వలన కొన్ని ఇబ్బందులను ఎదర్కొంటారు. దీనివల్ల ఈ రాశి వారు తమ పిల్లల ఆరోగ్యం, చదువుల గురించి ఎక్కువగా ఆందోళన చెందే అవకాశాలున్నాయి. మీరు విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించినట్లయితే, మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు.ఈ కాలంలో వీరు అనేక హెల్త్ సమస్యలను  ఎదుర్కోవలసి ఉంటుంది.

5 /6

ఈ రాశుల వారు ప్రతి నిత్యం శని దేవుడి ఆరాధనతో పాటు శని వారం నల్ల నువ్వులు, నల్ల బట్టతో పూజిస్తే శని దేవుడి అశుభ దృష్టి నుంచి తప్పించుకుంటారు. ఆయన చల్లని దీవెనలు మీకు వెన్నంటి ఉంటాయి.  

6 /6

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ పరిజ్ఞానం నెట్ లో లభించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా మేము దీనిని ZEE  NEWS దీన్ని ధృవీకరించడం లేదు.